పుణె: మరాఠీ నటి సోనాలీ కులకర్ణి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఆయుధాలతో చొరబడి హల్‌చల్ చేశాడు. మహారాష్ట్రలోని పుణెలో పింప్రి చించ్‌వాద్‌లో నివాసముంటున్న సోనాలీ ఇంట్లోకి మంగళవారం నాడు ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఒక ఫేక్ గన్, కత్తితో టెర్రస్ పై నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడిని చూసిన పని మనిషి భయంతో బిగుసుకుపోగా, తన వెనక పోలీసులు ఉన్నారని, కాబట్టి చప్పుడు చేయకుండా తను ఎక్కడ దాక్కోవాలో చెప్పమని ఆదేశించాడు.
ఇంతలో నటి తండ్రి మనోహర్ ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కత్తితో దాడి చేయడంతో మనోహర్‌కు గాయాలయ్యాయి. అనంతరం అతడు వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్పటికే అప్రమత్తమైన కాలనీవాసులు అతడిని చేజిక్కించుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే సదరు వ్యక్తి సోనాలి అభిమాని అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment