చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’ వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకుంది. కరోనా వల్ల అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 77వ వెన్నిస్ ఫెస్టివల్‌ను మాత్రం నిర్వహించారు. 2001లో మీరా నాయర్ తీసిన ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ తర్వాత వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంత దూరం వెళ్లిన చిత్రం ‘ది డిసిపుల్’ కావడం విశేషం. అలాగే ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణమే ఈ చిత్రకథ. ‘ది డిసిపుల్’ చిత్రదర్శకుడు గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment