ఆత్మల కాన్సెప్ట్‌తో వస్తోన్న హారర్ థ్రిల్లర్‌.. ‍‍ట్రైలర్ చూశారా? | Bollywood Movie Bhool Bhulaiyaa 3 trailer out now | Sakshi
Sakshi News home page

దీపావళికి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న ట్రైలర్

Published Wed, Oct 9 2024 4:55 PM | Last Updated on Wed, Oct 9 2024 5:06 PM

Bollywood Movie Bhool Bhulaiyaa 3 trailer out now

విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.

తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని హారర్ సీన్స్‌ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో వస్తోన్న సింగం ఎగైన్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement