విద్యాబాలన్‌కు ఇంత పెద్ద కూతురా? ఇన్నేళ్లు సీక్రెట్‌గా దాచిపెట్టిందా? | Vidya Balan Reacts To Rumours Of Having A Daughter After Spotted With Young Girl, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vidya Balan Secret Daughter Rumours: ఇంత పెద్ద కూతురు ఉందన్న విషయాన్ని హీరోయిన్‌ దాచిపెట్టిందా?

Published Wed, Oct 11 2023 12:03 PM | Last Updated on Wed, Oct 11 2023 12:31 PM

Vidya Balan Reacts to Rumours of Having a Daughter - Sakshi

విద్యాబాలన్‌.. డర్టీపిక్చర్‌ సినిమాతో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో అంతులేని క్రేజ్‌ అందుకున్న ఈ బ్యూటీ 2012లో నిర్మాత సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ను పెళ్లాడింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల విద్యాబాలన్‌ ఓ అమ్మాయితో కలిసి ఉన్న వీడియో తెగ వైరలయింది. ఎయిర్‌పోర్టులో ఆమె చేయి పట్టుకుని నడిపించింది. తతో పాటు ఫోటోలకు పోజిచ్చింది. ఇది చూసిన జనాలు విద్యాబాలన్‌ను ఇంత పెద్ద కూతురు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
తనకు కూతురు ఉందన్న విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచింది? అని అనుమానిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై విద్యాబాలన్‌ స్పందించింది. ఆ అమ్మాయి పేరు ఐరా అని, ఆమె తన సొంత కూతురు కాదని పేర్కొంది. అయితే తనకు కూతురు వరస అవుతుందని చెప్పింది. తన సోదరికి కవలలు సంతానం అని, అందులో ఒకరే ఐరా అని పేర్కొంది. అనవసరంగా దీన్ని పెద్ద విషయంగా చూస్తున్నారని అభిప్రాయపడింది.

సినిమాల సంగతి..
కాగా విద్యాబాలన్‌ 2005లో సినీప్రయాణం మొదలుపెట్టింది. తన కెరీర్‌లో ఎన్నో మర్చిపోలేని హిట్లు ఇండస్ట్రీకి అందించింది. 2014లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీని బహుకరించింది. ఇకపోతే విద్యాబాలన్‌ చివరగా నీయత్‌ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె సీబీఐ అధికారిణిగా నటించింది. ప్రస్తుతం లవర్స్‌ అనే సినిమా చేస్తోంది. ఇందులో ప్రతీక్‌ గాంధీ, ఇలియానా కూడా నటించనున్నారు.

చదవండి: ప్రశాంత్‌ వరస్ట్‌ కెప్టెన్‌.. తేల్చేసిన హౌస్‌మేట్స్‌.. కన్నీటితో బ్యాడ్జ్‌ వెనక్కిచ్చేసిన రైతుబిడ్డ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement