అయోమయం.. ఆశ్చర్యం | Sakshi
Sakshi News home page

అయోమయం.. ఆశ్చర్యం

Published Fri, Mar 22 2024 6:07 AM

Vidya Balan Do Aur Do Pyaar Teaser Released - Sakshi

విద్యాబాలన్, ప్రతీక్‌ గాంధీ, ఇలియానా, సెంథిల్‌ రామమూర్తి లీడ్‌ రోల్స్‌లో నటించిన బాలీవుడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘దో ఔర్‌ దో ప్యార్‌’. శీర్ష గుహ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

‘నేను వీగన్‌... పాలతో తయారైన వాటిని తినను (విద్యాబాలన్‌)’, ‘మరి.. మీ ఫేస్‌వాష్‌లలో మిల్క్‌ ఉంటుంది కదా (ప్రతీక్‌ గాంధీ)!’, ‘మనం డేటింగ్‌లో ఉన్న వారిలా లేము.. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటున్నాం (ఇలియానా)’ వంటి డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. ‘ప్రేమ కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అన్నవి కూడా టీజర్‌లో కనిపించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement