
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ టుక్‌టాక్ చేసింది. టిక్‌టాక్ అనుకుంటే పొరపాటు... తను నిజంగా టుక్‌టాకే చేసింది. సరదాగా టుక్‌టాక్ అనే ట్యాగ్‌తో తాను చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో బెంగుళూరు బ్యూటీ విద్యాబాలన్ ఎరుపు రంగు చీరలో కనిపిస్తారు. ఈ వీడియోలో విద్యాబాలన్ పండితుని వాయిస్‌ను అనుకరిస్తూ .. ‘శాస్త్రాల ప్రకారం ప్రతీ అమ్మాయిలో దేవీ రూపాలు ఉంటాయి. కాకపోతే పెళ్లి అయ్యాక ఏ అమ్మవారు వారిలో నుంచి బయటకు వస్తారనేది మాత్రం భర్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది’ అని చెబుతుంది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు.
కాగా విద్యాబాలన్ తాజా సినిమా మిషన్ మంగళ ఆగస్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్తల గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఒకపైపు ఆలోచింపజేస్తూనే మరోవైపు వినోదాన్ని అందిస్తుందని ఈ మూవీ హీరో అక్షయ్ కుమార్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే..!
Comments
Please login to add a commentAdd a comment