సినిమా వాళ్ల రూటే సెపరేటు.. వారికి పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా, లేకున్నా సరే.. కథ డిమాండ్ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మందు తాగేస్తారు. కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. సినిమా అయిపోయాక మాత్రం వాటిని అంత ఈజీగా వదిలేయలేరు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది హీరోయిన్ విద్యాబాలన్.
రోజూ సిగరెట్లు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సిగరెట్ ఎలా తాగుతారో తెలుసు కానీ నేనెన్నడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్‌లో నేను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు. అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నాను. ఆ సినిమా తర్వాత దానికి ఎంత అడిక్ట్ అయిపోయానంటే రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.
ఆ స్మెల్ ఇష్టం
ధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ప్రస్తుతమైతే సిగరెట్లు తాగడం లేదు. అయితే కాలేజీ చదివే రోజుల్లో బస్ స్టాప్‌లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు నచ్చేది' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల నుంచి కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment