ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్.. ఇలాంటివి చిత్రీకరించడంలో బాలీవుడ్ ఎప్పటినుంచో ముందు వరుసలో ఉంది. ఇలాంటివి తీయడంలో టాలీవుడ్ వాళ్లు తడబతడారేమో కానీ బాలీవుడ్ మాత్రం పర్ఫెక్షన్ చూపిస్తుంది. ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 సినిమా తెరకెక్కించింది. ఇది 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్‌కు సీక్వెల్. టైటిల్ చూసి మోసపోవద్దని, సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయంది తమన్నా. ఆమె మాటను నమ్మితే మోసపోయినట్లే! ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లే ఉందని, అంతా బోల్డ్ కంటెంటే అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీర్పు ఇచ్చేశారు.
ఇలాంటి మితిమీరిన బోల్డ్ కంటెంట్‌తో గతంలో వచ్చిన డర్టీ పిక్చర్ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకుంది విద్యాబాలన్. తాజాగా ఆమె ప్రేమ, కామం వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2012లొ సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడిన ఆమె తమ మధ్య ముందు అట్రాక్షన్ ఏర్పడిందని పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'నిజానికి మొదట్లో నేను పెళ్లి చేసుకోవాలనే అనుకోలేదు. కానీ ఓ వయసు వచ్చాక నాలో చాలా పరిణతి వచ్చింది.
30 ఏళ్లకే నేను ఎంతో సక్సెస్ చూశాను. దాన్ని ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. కొంతమందితో డేటింగ్ చేశాను, కానీ వర్కవుట్ కాలేదు. ఒంటరిని అన్న ఫీలింగ్ ఎక్కువైంది. మన మంచిచెడ్డలు, కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ వ్యక్తి కావాలనిపించింది. ఈ క్రమంలో కొందరితో లవ్‌లో పడ్డా ఆ ప్రేమ కథలేవీ సుఖాంతం కాలేదు. కొన్నిసార్లు దారుణంగా మోసపోయాననిపించింది. అప్పుడే నేను అన్నింటినీ సీరియస్‌గా తీసుకోవడం మానేసి జాలీగా ఉండటం మొదలుపెట్టాను.
అటువంటి సమయంలో ఓసారి సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను చూశాను. చూడగానే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడనిపించింది. అదే మా లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ఒకరికొకరం ఆకర్షితులయ్యాం. ముఖ్యంగా సిద్దార్థ్ నన్ను చూసుకునే విధానానికి ఇంకా పడిపోయాను. అతడే ముందుగా ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పి కలిసి ముందుకు ప్రయాణించాం' అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.
చదవండి: మనోజ్, మౌనిక.. నాన్నను ఎలాగైనా ఒప్పించమని వేడుకున్నా: మంచు లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment