
చెన్నై,పెరంబూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సినీ ప్రేక్షకులను ఎంతగా రంజింపజేస్తుందో, సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజ మాన్యాన్ని ఘోరంగా ముంచేస్తోంది. పైరసీదా రులను ఎవరూ అరికట్టలేని పరిస్థితి. పైరసీదా రులు ఎంత దారుణానికి ఒడికడుతున్నారంటే కొత్త చిత్రం తెరపైకి రాక ముందే అక్రమంగా వెబ్‌సైట్స్‌లో ఆడేస్తున్నాయి. ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చిత్రాలకు వందల మంది శ్రమ, కృషి ఉంటుంది. వందల మంది జీవనం సిని మా. అలాంటి సినిమాను క్షణాల్లో అక్రమంగా దోచుకుంటున్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు ఏం చేయలేని పరిస్థితి. తాజాగా నేర్కొం డ పార్వై చిత్రం అలాంటి అక్రమ దోపిడికే గురైంది.
విడుదలకు రెండు రోజుల ముందే.
స్టార్ నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం నేర్కొండ పార్వై. నటి విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్, అబిరామి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత భోనీకపూర్ నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇదే. హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ ఇది. హేచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. కాగా మంగళవారం నుంచే చిత్ర ప్రీమియం షోలను ప్రదర్శించారు. విదేశాల్లోనూ విడుదల చేశారు. చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అజిత్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఎక్కడ? ఎవరు? చిత్ర పైరసీకి పాల్పడ్డారో గాని నేర్కొండపార్వై మంగళవారం సాయంత్రమే వెబ్‌సైట్లలో వైరల్ అవుతోంది. ఇలా విడుదలకు రెండు రోజులు ముందే కొత్త చిత్రం ఇంటర్నెట్లలో ప్రచారం అయితే ఏ ఎగ్జిబిటర్ మాత్రం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ఇష్టపడతాడు? అజిత్ వంటి ప్రముఖ నటుడి చిత్రానికే ఈ గతి అయితే ఇక చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని సినీ వర్గాలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు తీర్పును ధిక్కరిస్తూ..
నిర్మాత భోనీకపూర్ నేర్కొండ పార్వై చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులు తమకే చెంది ఉన్యాయని చిత్రాన్ని వెబ్‌సైట్లలో అక్రమంగా ప్రచారం కాకుండా నిషేధించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నేర్కొండ పార్వై చిత్రాన్ని వెబ్‌సైట్లలో ప్రచారంపై నిషేధం విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సుమారు 1129 వెబ్‌సైట్స్‌ను మూయించి వేసిం ది. అయినా కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ విడుదలకు రెండు రోజుల ముందే నేర్కొండ పార్వై చిత్రం వెబ్‌సైట్స్‌లో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment