ఆడపులి | Vidya Balan kickstarts the shoot Amit Masurkar's Sherni Movie | Sakshi
Sakshi News home page

ఆడపులి

Published Fri, Mar 6 2020 2:58 AM | Last Updated on Fri, Mar 6 2020 2:58 AM

Vidya Balan kickstarts the shoot Amit Masurkar's Sherni Movie - Sakshi

విద్యా బాలన్‌

విద్యా బాలన్‌ ఆడపులిలా మారబోతున్నారు. అంటే అంత పవర్‌ఫుల్‌గా అన్నమాట. ‘షేర్నీ’ అనే సినిమాలో ఆమె శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. షేర్నీ అంటే ఆడపులి అని అర్థం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. మర్డర్‌ 3 (2011), ‘సులేమానీ కీడా’ (2014), ‘న్యూటన్‌’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించిన అమిత్‌ మసూర్‌కర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ‘న్యూటన్‌’కి జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 90వ ఆస్కార్‌ ఆవార్డుల నామినేషన్‌ ఎంట్రీకి మన దేశం తరఫున ‘న్యూటన్‌’ వెళ్లింది. ఇప్పుడు ఓ మంచి కథతో అమిత్‌ ‘షేర్నీ’ని తెరకెక్కించనున్నారట. ‘‘ఈ సినిమాలో నాది మంచి పాత్ర. చాలా థ్రిల్‌గా ఉంది’’ అన్నారు విద్యాబాలన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement