విద్యా బాలన్
తాజా చిత్రం కోసం పవర్‌ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా మారారు విద్యా బాలన్. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందని టాక్. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొనబోతున్నారట విద్యా బాలన్. సినిమా పూర్తయ్యేంతవరకూ షూటింగ్ చేయాలని ప్లాన్ చేసిందట చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment