బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్‌నెస్ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్‌నెస్‌తో మెయింటైన్ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటంటే..
విద్యాబాలన్ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్‌లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు.
బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్‌ఫ్లమేషన్‌ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్‌ఫ్లమేషన్ డైట్. అయితే ఇదేలా పనిచేస్తుందంటే..
'ఇన్‌ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..
ఇది యాంటీ ఆక్సిడెంట్‌లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్‌లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.
కూరగాయలు..
బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
పండ్లు..
బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
అవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి.
మంచి కొవ్వులు ఉండే చేపలు
మాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్, ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి.
సుగంధ ద్రవ్యాలు, నట్స్
బాదం, పిస్తా వంటి వాల్‌నట్‌ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!)
Comments
Please login to add a commentAdd a comment