కరోనా దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్ ఎప్పడు ఎత్తేస్తారో తెలియదు.. ఒకవేళ ఎత్తేసినా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కొత్త సినిమా షూటింగ్‌ల సంగతి తరువాత.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పటకే పలు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.(పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?)
ఈ విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా ప్రకటించారు. ‘‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. చాలా త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మీ ముందుకు రాబోతుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు విద్యా బాలన్. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. (గణిత ఘనాపాటి)
ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెకక్కిన సంగతి తెలిసిందే. శకుంతలా దేవి పాత్రలో విద్యా బాలన్ నటించారు. అయితే మే 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు.(ఆడపులి)
Comments
Please login to add a commentAdd a comment