Shakuntala Devi
-
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శాకుంతలాదేవిని మోసం చేసింది ఎవరు?
-
పాఠాలు నేర్పిన స్త్రీ పాత్రలు
‘చెంపదెబ్బే’ కదా అని అన్ని పాత్రలు అంటాయి. ‘చెంప దెబ్బ అయినా సరే’ అని ‘థప్పడ్’ సినిమాలో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించే భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది స్త్రీ పాత్ర. భర్త పండు ముసలివాడైపోయినా సరే అతని కుత్సిత బుద్ధిని క్షమించలేక అతి వృద్ధురాలైన అతని భార్య మరొకరితో వివాహాన్ని కోరుకుంటుంది ‘గులాబో సితాబో’లో. ‘నా మేధను నేను కొనసాగిస్తాను కుటుంబ అడ్డంకులను తొలగించుకునైనా సరే’ అని ‘శకుంతలా దేవి’ పాత్ర మనకు చెబుతుంది. ‘యాసిడ్ దాడి నా భవిష్యత్తుకు ముగింపు కాదు’ అని ఆశను ఇస్తుంది ‘చపాక్’లోని ఒక పాత్ర. బాలీవుడ్ పైకి చూడటానికి నాలుగు డబ్బులు సంపాదించే రంగంగా కనిపించొచ్చు. కాని అది తయారు చేసి వదులుతున్నస్త్రీ పాత్రలు చాలా గట్టి పాఠాలు చెప్పేలా ఉంటున్నాయి. తప్పులు సరిచేసుకోమని పురుషులకు బోధ చేస్తున్నాయి. నేర్చుకోవాలనుకునే మగవారు తక్కువగా ఉన్నా నేర్పే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి వారికి స్త్రీల గురించి. సమాజం కొన్ని పాఠాలు చెబుతుంది. సాహిత్యం కొన్ని పాఠాలు చెబుతుంది. సినిమా కూడా కొన్ని పాఠాలు చెబుతుంది. స్త్రీని గౌరవించడం, స్త్రీ అభిప్రాయాలకు సమాన భూమికను ఏర్పరచడం, స్త్రీ మనోభావాలను గమనించడం పురుష ఆధిపత్యం ఉండే ఈ సమాజంలో ఎప్పటికప్పటి పాఠాల ద్వారానే సాధ్యమవుతుంది. గత నాలుగైదేళ్లుగా స్త్రీల స్వావలంబనను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, మూసకు తలవొంచని పట్టుదలను, లైంగిక మర్యాదలను వ్యక్తం చేసే స్త్రీ పాత్రలు బాలీవుడ్లో అనేకం వస్తున్నాయి. స్త్రీలను మరింతగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. 2020 కూడా అందుకు మినహాయింపు కాదు. లాక్డౌన్ వల్ల నేరుగా సినిమాలు విడుదల కాకపోయినా ఓటిటిల ద్వారా విడుదలైన సినిమాలు స్త్రీలకు సంబంధించి గట్టి స్టేట్మెంట్లు ఇచ్చాయి. చెంపదెబ్బపై చూపుడువేలు 2020 విడుదలైన సినిమాలలో గట్టి చర్చ లేవదీసిన సినిమా ‘థప్పడ్’. ఇళ్లల్లో అతి సాధారణంగా స్త్రీలు తినే చెంపదెబ్బను వేలెత్తి చూపిన సినిమా ఇది. ఈ సినిమాలో భార్యను భర్త చెంపదెబ్బ కొడతాడు. భర్త మంచివాడే. అత్తామామలు మంచివారే. ఇల్లూ మంచిదే. కాని చెంపదెబ్బ కొట్టడం మాత్రం మంచిది కాదు అనుకుంటుంది ఆ భార్య. విడాకులు కోరుతుంది. ‘చెంపదెబ్బే కదా’ అంటారు అందరూ. ఏ కొడుకూ తన తండ్రిని తల్లిని చెంపదెబ్బ కొట్టడు. భార్యను మాత్రం కొట్టొచ్చు అనుకుంటాడు. తండ్రిని కొట్టి ‘చెంపదెబ్బే కదా’ అనలేనప్పుడు అంతే సమాన గౌరవం ఇవ్వాల్సిన భార్యను మాత్రం ఎందుకు కొట్టాలి. గృహహింస అంటే రాచి రంపాన పెట్టడం కాదని, స్త్రీ తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించే చెంపదెబ్బ కూడా చాలునని ఈ సినిమా చెప్పింది. తాప్సీ పన్ను ఈ పాత్ర పోషించింది. ఎగరడానికి రెక్కలు ‘ఇది పురుషుల స్థలం. ఇక్కడ స్త్రీలకు చోటు లేదు’ అంటాడు ఎయిర్‌ఫోర్స్‌లో ఒక పురుష ఆఫీసర్ గుంజన్ సక్సేనాతో. ఉమన్ పైలెట్ కావాలని ఎయిర్ ఫోర్స్‌లో చేరిన గుంజన్ సక్సేనాకు అక్కడ అంతా పురుష ప్రపంచమే కనిపించడం సవాలుగా మారుతుంది. అసలు ఆ స్థలాన్ని డిజైన్ చేయడమే పురుషుల కోసం చేసి ఉంటారు. స్త్రీల రూములు, బాత్రూములు, యూనిఫామ్ చేంజ్ రూమ్‌లు ఏవీ ఉండవు. స్త్రీలకు ఎగిరే పాఠాలు చెప్పడం నామోషీగా భావిస్తారు మరికొంత మంది ఆఫీసర్లు. అయినప్పటికీ గుంజన్ తాను ఎగరడానికి రెక్కలు మొలిపించుకుంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలెట్‌గా నిలిచి కార్గిల్ వార్ సమయంలో సేవలు అందించి చరిత్ర లిఖించింది. గుంజన్ సక్సేనా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన బయోపిక్ ‘గుంజన్’ భిన్న రంగాల్లో పని చేయాలనుకునే స్త్రీలకు ఒక ధైర్యం ఇచ్చింది. పురుషులను సెన్సిటైజ్ చేసింది. పొగల నుంచి పునరుత్థానం అత్యంత దుర్బలుడైన పురుషుడెవడంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునేవాడే. అత్యంత శిక్షార్హమైన వ్యక్తి కూడా. యాసిడ్ దాడులు స్త్రీకి ‘గుణపాఠం’ అని భావించేవారికి గుణపాఠం చెప్పిన విజేతలు ఉన్నారు. ‘కుళ్లి కుళ్లి చావాలి’ అని యాసిడ్ జల్లినవాడే కుళ్లి కుళ్లి చచ్చేలా ఆ యాసిడ్ విజేతలు తమను తాము కూడదీసుకున్నారు. గౌరవాన్ని తిరిగి పొందారు. జీవికను కూడా పొందారు. ‘ముఖం మాత్రమే దెబ్బతింది. ఆత్మవిశ్వాసం కాదు.. పోరాట పటిమా కాదు’ అని చెప్పారు వీరు. అలా చెప్పిన వారిని వార్తల్లో చదవడం కంటే తెర మీద చూసి స్ఫూర్తి పొందే వీలు కల్పించింది ‘చపాక్’ సినిమా. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ విజేత బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో ముఖ్యపాత్రను దీపికా పడుకోన్ పోషించి స్త్రీ చైతన్యంలో తన వంతు భాగస్వామ్యాన్ని కలిపింది. మరోమహిళ మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిందని గుర్తు పెట్టుకోవాలి. లెక్క తప్ప కూడదు ‘నువ్వెంత జీనియస్వి అయినా ఒక భర్తకు భార్యవే... ఒక బిడ్డకు తల్లివే’ అని చెబుతుంది సమాజం. అదే భర్త జీనియస్ అయితే ‘ఆయన మానాన ఆయన్ని వదిలిపెట్టి ఇంటి సంగతి నువ్వు చూసుకోమ్మా’ అని స్త్రీకి సుద్దులు చెబుతుంది. తన మేధను చాటడానికి భూభ్రమణం చేసే హక్కు పురుషునికే ఉంది. ‘నాకూ ఉంది’ అని మేథమేటిక్స్ జీనియస్ శకుంతలా దేవి చెప్పింది. భర్తనూ కుటుంబాన్ని ఆమె గౌరవించినా తన మేధను చాటడంలో అవి అడ్డంకిగా మారుతాయని తెలిసినప్పుడు ఆమె ఒక భర్త బంధాన్ని వొదులుకుని కూతురి బంధం కోసం పెనుగులాడుతుంది. ఇలాంటి స్త్రీలను మూస చట్రం వ్యతిరేకంగా చూసేలా చేస్తుంది. ఇలాంటి స్త్రీలను అసలు అర్థం చేయించే ప్రయత్నం కూడా చేయదు. కాని ‘శకుంతలా దేవి’ బయోపిక్ చేసింది. శకుంతలా దేవిగా విద్యాబాలన్ ఈ సంవత్సరం గుర్తుండిపోయింది. బెత్తం ఎత్తాలి కొన్ని ఇండ్లలో పండు ముసలివారై పోయినా ఆ భర్త ఆ భార్య మీద అరవడమూ, కసరడమూ చేస్తూ ఉంటాడు. ఆమె వాటిని సహిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లు పడుతున్నది ఇంకొన్నాళ్లు పడితే సరిపోతుంది అనే భావజాలం ఆమెను అలా చేసి ఉంటుంది. కాని ‘గులాబో సితాబో’లోని స్త్రీ పూర్తి భిన్నం. అందులో ఆమెకు 90 దాటి ఉంటాయి. ఆమె జమీందారు. భర్తకు కూడా 90 దాటి ఉంటాయి. కాని అతడు ఆ భార్య ఎప్పుడు చస్తుందా ఆమె పేరున ఉన్న ఆస్తి తనకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె పట్ల ప్రేమ, పక్కన కూచుని కబురు, మంచి చెడ్డలు ఏవీ పట్టవు అతనికి. దురాశ తప్ప. ఆ వయసులో ఏం బావుకుంటాడో కూడా తెలియదు. ఇలాంటి మగవారిని ఏం చేయాలి? ఆమె అస్సలు క్షమించదు. అతనికి విడాకులు ఇచ్చి తన జమిందారీలోని పూచిక పుల్ల ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. సగటు భారతీయ సమాజంలో అందరూ గుండెలు బాదుకునే విషయమే ఇది. కాని స్త్రీలు తమకు ప్రేమ, గౌరవం దొరకని చోట తాము ఉండరు అని చెప్పదలుచుకున్నది ఈ పాత్ర. నటి ఫరూక్ జాఫర్ ఈ పాత్ర పోషించింది. భర్తగా అమితాబ్ బచ్చన్. లాక్డౌన్ వల్లగాని మరికొన్ని గట్టి పాఠాలు చెప్పే స్త్రీల పాత్రలు కూడా ఈ సంవత్సరం వచ్చేవి. సరే లేండి. వచ్చే సంవత్సరం ఎలాగూ వస్తోందిగా. – సాక్షి ఫ్యామిలీ -
సోషల్ మీడియాలో విద్యాబాలన్ మార్కులు..
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు తమ వ్యక్తిగత అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన పదవ తరగతి మార్కులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే తాను చదువులో జీనియస్‌ను కాదని, కానీ సంతృప్తికర మార్కులు వచ్చేవని తెలిపింది. తన పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 150 మార్కులకు గాను 125మార్కులు వచ్చావని, అన్ని సబ్జెక్ట్‌లను కలిపి పదవ తరగతిలో 82.42శాతం మార్కులు సాధించానని పేర్కొంది. మరోవైపు విద్యాబాలన్ తాను చూపెట్టినట్లుగానే అభిమానులు మ్యాథ్స్ మార్కులు చూపెట్టాలని సూచించారు. గణిత మేధావి శకుంతులా దేవీ తన గణిత ప్రతిభతో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాధించుకున్నారు. అయితే శకుంతలా దేవి జీవితాన్ని విద్యా బాలన్ గొప్పగా నటిస్తే అంజు మీనన్ దర్శకత్వం సినిమాను విపరీతంగా ఆకర్శించింది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా పాత్రలో విద్యా బాలన్ నటన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. చదవండి: ‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’ -
ఆమె జీవితం ఒక జటిలమైన లెక్క
‘నేను చెట్టును కాను... ఉన్న చోటునే ఉండిపోవడానికి’ ‘ఏ ఊళ్లో అయినా నాలుగు రోజులు దాటితే నాకు బోర్ కొట్టేస్తుంది’ ‘నాకు కాళ్లున్నాయి.. ప్రపంచమంతా చుట్టేయాలని ఉంది’ శకుంతలా దేవిని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. జటిలమైన లెక్కల్ని సెకన్లలో తేల్చేసిన ఈ ‘హ్యూమన్ కంప్యూటర్’ జీవితం కూడా జటిలమైన లెక్క లాంటిదే. కూతురిగా, తల్లిగా, భార్యగా, జీనియస్‌గా ఆమె తన భావోద్వేగాలనే తాను విశ్వసించింది. ఎదుటివారితో ఇది ఘర్షణకు కారణమైంది. ఆమె బయోపిక్ ‘శకుంతలా దేవి’ ఆమె కథను చెబుతోంది. ‘రెండు జడలతో లెక్కలు చేసే’ ఒక భారతీయ జీనియస్‌ను పున:పరిచయం చేస్తుంది. కుటుంబం కూడా భలే స్వార్థపూరితమైనది. ఎవరికైనా ఇంట్లో రెక్కలు మొలిచాయని గ్రహించిన వెంటనే ఇక అన్ని పనులు పక్కన పెట్టి అన్ని బరువులను ఆ మనిషి మీద వేయడానికి చూస్తుంది. ‘శకుంతలా దేవి’ జీవితంలో జరిగింది అదే. కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన మేధ ఆమెకు వచ్చింది. ఆమె మెదడులో గణితానికి సంబంధించిన అద్భుతమైన శక్తి ఏదో నిక్షిప్తమై ఉంది. అది ఆమె ఐదో ఏటనే బయట పడింది. ఆ క్షణం నుంచి ఆమె కుటుంబానికి ఒక ‘సంపాదించే లెక్క’ అయ్యిందే తప్ప ప్రేమను పొందాల్సిన సభ్యురాలు కాకపోయింది. బెంగళూరు పసి మేధావి శకుంతలా దేవి బెంగళూరులోని ఒక సనాతన ఆచారాల కన్నడ కుటుంబంలో పుట్టింది (1929). వాళ్ల నాన్న సర్కస్‌లో పని చేసేవాడు. ట్రిక్స్ చేసేవాడు. శకుంతలా దేవి మూడేళ్ల వయసులో కార్డ్ ట్రిక్స్‌ను గమనించేది. ఐదేళ్ల వయసు వచ్చేసరికి అర్థ్‌మెటిక్స్‌లో అనూహ్యమైన ప్రతిభను కనపరచడం మొదలెట్టింది. రెండు రూపాయల ఫీజు కట్టలేక డ్రాపవుట్ అయిన ఈ పసిపాప ఆ క్షణం నుంచి కుటుంబానికి జీవనాధారం అయ్యింది. తండ్రి ఆ చిన్నారిని వెంట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇప్పించి ఫీజు వసూలు చేసి కుటుంబాన్ని నడిపేవాడు. ఆమెను అతడు మరి స్కూలుకే పంపలేదు. శకుంతలాదేవికి స్కూల్ చదువు ఉండి ఉంటే ఆమె ఏయే సిద్ధాంతాలు కనిపెట్టేదో. కాని ఆమె సాటివారిని అబ్బురపరిచే గణిత యంత్రంగా ఆ మేరకు కుదింపుకు లోనయ్యింది. తోబుట్టువు మరణం తమ ఇళ్లల్లో స్త్రీలు ముఖ్యంగా తన తల్లి బానిసలా పడి ఉండటం, తండ్రిని ఎదిరించి తనను, తన తోబుట్టువులను బాగా చూసుకోలేకపోవడం గురించి శకుంతలాదేవికి జీవితాంతం కంప్లయింట్లు ఉన్నాయి. వికలాంగురాలైన తన పెద్దక్క సరైన వైద్యం చేయించకపోవడం వల్ల మరణించిందనీ, ఇందుకు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని ఆమెకు ఆజన్మాంత ఆగ్రహం కలిగింది. ఆ అక్కతో శకుంతలాదేవికి చాలా అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ పోవడంతో తల్లిదండ్రులతో మానసికంగా ఆమె తెగిపోయింది. అప్పటికే దేశంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందిన శకుంతలా దేవి తన పదిహేనవ ఏట 1944లో లండన్ చేరుకుంది. లండన్ జీవితం శకుంతలా దేవికి ఇంగ్లిష్ రాదు. చదువు లేదు. ఉన్నదల్లా గణిత విద్య. దాంతో ఆమె సర్కసుల్లో పని చేసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంది. కాని రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ లెక్కలు చేయడం ఏమిటని, ఒక వేళ చేసినా అదేదో మేజిక్ లాంటిదే తప్ప మేధస్సు అయి ఉండదని చాలామంది నిరాకరిస్తారు. అప్పుడు పరిచయమైన ఒక స్పానిష్ మిత్రుడు శకుంతలా దేవిని అక్కడి పరిసరాలకు అవసరమైనట్టుగా గ్రూమ్ చేస్తాడు. అక్కడి యూనివర్సిటీలు ఆమెను పరీక్షిస్తాయి. అక్కడి సాధారణ ప్రజలు ఆమెను గుర్తిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా భారతీయ ఆహార్యాన్ని వదలకుండానే చీరలో పొడవైన కురులలో గణిత విద్యలు ప్రదర్శిస్తూ ఆమె విజేతగా నిలిచింది. అనూహ్య ప్రతిభ 95,443,993 క్యూబ్‌రూట్‌ను 457గా ఆమె రెండు సెకన్లలో జవాబు చెప్పింది. 33 అంకెల సంఖ్యను ఇచ్చి దాని సెవెన్త్ రూట్‌ను చెప్పమంటే 40 సెకన్లలో జవాబు చెప్పి చకితులను చేసింది. ఇక 1980 జూన్‌లో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆమెకు రెండు 13 అంకెల సంఖ్యల గుణకారం ఇస్తే 28 సెకెన్లలో జవాబు చెప్పి రికార్డు సాధించింది. గడిచిన శతాబ్దంలోని తేదీలు చెప్తే ఒక్క సెకనులో ఆమె ఆ తేదీన ఆ ఏ వారం వస్తుందో చెప్పేది. కొందరు సైంటిస్ట్‌లు ఉత్సాహం కొద్దీ ఆమె మెదడును పరిశీలించారుగాని ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ మేధ ఆమెకు మాత్రమే సొంతం. బంధాల జటిలత్వం సినిమాలో చూపిన కథ ప్రకారం ఆమెను గ్రూప్ చేసిన స్పానిష్ మిత్రుడు ఆమె లండన్‌లో గుర్తింపు పొందాక ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె కలకత్తాకు చెందిన ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌ను 1960లో పెళ్లి చేసుకుంది. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె జన్మించింది. తన ప్రదర్శనలు, పర్యటనలు ఆపేసి కొంతకాలం శకుంతలాదేవి కలకత్తాలో ఉండిపోయినా ఆమెకు అలా ఉండిపోవడం తీవ్ర అశాంతి కలిగిస్తుంది. భర్త అనుమతితో తిరిగి ప్రపంచ పర్యటన ప్రారంభిస్తుంది గాని కూతురికి దూరమయ్యాననే గిల్ట్ ఉంటుంది. ఆ తర్వాత తనే కూతురిని తీసుకుని భర్తను వదిలి తన వద్దే ఉంచుకుంటుంది. తన తండ్రి తనతో ఎలా వ్యవహరించాడో తాను కూడా కూతురి చదువు వదిలిపెట్టి తనతో పాటు తిప్పుకోవడం భర్త సహించలేకపోతాడు. క్రమంగా ఇది వారి విడాకులకు కారణమవుతుంది. కూతురిని ఎక్కడ కోల్పోతానోనని శకుంతలా దేవి ఆ అమ్మాయిని తండ్రికే చూపక పదేళ్ల పాటు దూరం చేసేస్తుంది. ఇవన్నీ తల్లీకూతుళ్ల మధ్య ఘర్షణకు కారణమవుతాయి. భర్తతో విడాకులు అవుతాయి. ఎన్ని జరిగినా శకుంతలా దేవి రెంటిని గట్టిగా పట్టుకోవడం కనిపిస్తుంది. ఒకటి లెక్కలు. రెండు కూతురు. లెక్కలకు ప్రాణం ఉండదు. ప్రాణం ఉన్న కూతురు ఆమెతో తీవ్ర పెనుగులాటకు దిగుతుంది. ‘నన్ను నా కూతురు ఎప్పుడూ తల్లిలానే చూసింది. నన్నో జీనియస్‌గా చూసి ఉంటే సరిగా అర్థం చేసుకునేది’ అని శకుంతలా దేవి అంటుంది. మరణించే సమయానికి కూతురితో ఆమెకు సయోధ్య కుదరడం ప్రేక్షకులకు ఊరట కలుగుతుంది. శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ గొప్ప ప్రయత్నం ఈ గొప్ప స్త్రీ జీవితాన్ని ఒక స్త్రీ అయిన విద్యా బాలన్ గొప్పగా అభినయిస్తే మరో స్త్రీ అయిన అంజు మీనన్ గొప్పగా దర్శకత్వం వహించింది. భారత్‌లో, లండన్‌లో ముందు వెనుకలుగా కథ నడుస్తూ శకుంతలా దేవి జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా విద్యా బాలన్ పరిపూర్ణంగా రూపాంతరం చెందింది. ఆమె కాకుండా మరొకరు ఆ పాత్ర అంత బాగా చేయలేరేమో. కొన్ని జీవితాలు రిపీట్ కావు. కాని వాటి నుంచి కొంత నేర్చుకోవచ్చు. శకుంతలా దేవి సినిమాను చూసి స్త్రీలు, పురుషులు విద్యార్థులు తప్పక నేర్చుకుంటారు. అదేమిటనేది వారి వారి వివేచనను బట్టి ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా లభ్యం. – సాక్షి ఫ్యామిలీ -
‘నాకు బిడ్డ కావాలి.. భర్త కాదు’
బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అనూ మీనన్ దర్శకత్వం వహించారు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతలా దేవి బాల్యం, హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమె ఎదిగిన క్రమంలో ఎదురైన అనుభవాలు.. ముఖ్యంగా గిన్నిస్‌బుక్ రికార్డు సాధించినప్పటికీ తన కూతురి చేత మంచి తల్లి అనిపించుకోలేకపోయిన సంఘటనలను స్పృశిస్తూ ట్రైలర్ సాగింది.(కథ వింటారా?) ముఖ్యంగా శకుంతలా దేవి వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని అనేక విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆడపిల్లలపై వివక్ష గురించి మాట్లాడే శకుంతలా దేవి.. ‘‘నాకు ఓ బిడ్డ కావాలి. కానీ భర్త కాదు’’ అంటూ కొంటెగా సమాధానం చెప్పడం.. కూతురు పుట్టిన తర్వాత భర్తకు దూరం కావడం, ఈ క్రమంలో గణితశాస్త్రమే సర్వస్వంగా బతికే తల్లిపై ఆమె కూతురు ద్వేషం పెంచుకోవడం వంటి భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. తల్లి నుంచి దూరమైన కూతురు ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధం కావడం, ‘‘నేనెప్పుడూ ఓడిపోను. అది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి’’ అని శకుంతలా దేవి సమాధానం చెప్పడం వంటి సీన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్ శకుంతలా దేవి పాత్రలో మరోసారి తనదైన నటనతో అందరి మనసులు దోచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదల కానుంది. -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
ఓటీటీ బాటలో మరో సినిమా
కరోనా దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్డౌన్ ఎప్పడు ఎత్తేస్తారో తెలియదు.. ఒకవేళ ఎత్తేసినా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కొత్త సినిమా షూటింగ్‌ల సంగతి తరువాత.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పటకే పలు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.(పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?) ఈ విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా ప్రకటించారు. ‘‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. చాలా త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మీ ముందుకు రాబోతుంది’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు విద్యా బాలన్. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. (గణిత ఘనాపాటి) ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెకక్కిన సంగతి తెలిసిందే. శకుంతలా దేవి పాత్రలో విద్యా బాలన్ నటించారు. అయితే మే 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నారు.(ఆడపులి) -
డాటరాఫ్ శకుంతల
మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన ఇద్దరు కుమార్తెలు గీతా, బబితాల జీవితాల ఆధారంగా మూడేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘దంగల్’. మహావీర్‌గా ఆమిర్ ఖాన్, బబిత పాత్రను సాన్యా మల్హోత్రా చేశారు. ఇప్పుడు ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ సినిమాలో విద్యాబాలన్ కుమార్తెగా నటిస్తున్నారు సాన్య. ఇండియాలో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు గాంచిన గణితవేత్త, రచయిత శకుంతలాదేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. శకుంతలదేవి కూతురు అనుపమా బెనర్జీ పాత్రను సాన్య చేస్తున్నారు. శుక్రవారం సాన్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘దంగల్’ సినిమాలో నా పాత్ర కోసం జుత్తు కత్తిరించుకున్నాను. ఇప్పుడు అనుపమ పాత్ర కోసం కూడా నా జుత్తును కట్ చేసుకోవాల్సి వచ్చింది. పాత్ర కోసం ఇలా మారడం నాకు సంతోషంగానే ఉంది. నిజజీవిత పాత్రలను పోషించేటప్పుడు వారి లుక్‌లోకి మారిపోతే బాగా నటించవచ్చని నా నమ్మకం’’ అన్నారు సాన్య. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
గణిత ఘనాపాటి
ఏదైనా లెక్క కట్టాలంటే వెంటనే కబోర్డ్‌లో ఉన్న క్యాలిక్యులేటర్‌ని వెతుకుతాం. కానీ శకుంతలా దేవికి క్యాలిక్యులేటర్ అక్కర్లేదు. వేళ్లతోనే ఎంత పెద్ద లెక్కైనా వేసేస్తారు. అందుకే ఆమెను గణిత ఘనాపాటి అంటుంటారు. హ్యూమన్ కంప్యూటర్ అన్నట్టు. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విద్యా బాలన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. బాబ్డ్ హెయిర్ కట్‌తో విద్యాబాలన్ కనిపిస్తున్నారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్‌తో జరిగిన రేస్‌లోనూ శకుంతలా దేవియే ఫస్ట్ వచ్చిందనే కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
‘శకుంతలా దేవీ’ మొదలైంది!
కంప్యూటర్ కంటే వేగంగా గణించడం.. మానవ మేధస్సుకు సాధ్యపడనిది లేదని నిరూపించిన శకుంతలా దేవీ జీవతం ఆధారంగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హ్యూమన్ కంప్యూటర్‌గా పేర్గాంచిన శకుంతలా దేవీ పాత్రలో బాలీవుడ్ సంచలన నటి విద్యా బాలన్ నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. ‘శకుంతలా దేవీ’గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ నేడు(సెప్టెంబర్ 16) మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి విద్యాబాలన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్లో విద్యాబాలన్ నెం.1 పొజిషన్లో ఉండగా.. కంప్యూటర్, క్యాలికులేటర్ రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు అను మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
విద్యావంతురాలు
విద్యాబాలన్ ఈ మధ్య వరుసగా విద్యావంతురాలి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ‘మిషన్ మంగళ్’లో ఇస్రో శాస్త్రవేత్తగా కనిపించిన విద్యా, ప్రస్తుతం ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు పొందిన గణిత ప్రావీణురాలు శకుంతలా దేవి బయోపిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అను మీనన్ దర్శకురాలు. ఈ సినిమాలో తన లుక్ గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘ఈ పాత్రలో బాబ్డ్ హెయిర్ కట్లో కనిపిస్తాను. నా సౌతిండియన్ ఫేస్ కట్ ఈ మ్యాథ్స్ జీనియస్‌కు బాగా మ్యాచ్ అవుతుందనుకుంటున్నాను. శకుంతలగారి 20 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వయసు వరకు అన్ని లుక్స్‌లో కనిపిస్తాను’’ అన్నారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు విద్యా. -
హ్యూమన్ కంప్యూటర్
ఎలాంటి మేథమేటిక్స్‌నైనా చిటికెలో సాల్వ్ చేయగలనని చాలెంజ్ చేస్తున్నారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. అందులోనూ తాను అరిథ్‌మెటిక్స్ ఫేవరెట్ అంటున్నారు. విద్యాబాలన్ సడన్‌గా లెక్కల వైపు ఎందుకు వెళ్లారనేగా మీ సందేహం? ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ నటించబోతున్నారు. గణితశాస్త్త్రంపై ఎన్నో పుస్తకాలు, రచనలు చేసిన శకుంతలాదేవికి ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా ‘లండన్ ప్యారిస్ న్యూయార్క్’ చిత్రదర్శకుడు అనూ మీనన్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. దానిని విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ‘ ‘హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవిగా పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె ఎంతో ఖ్యాతిని గడించారు. ఫెమినిస్ట్‌గా తన గొంతును వినిపించారు’’ అన్నారు విద్యాబాలన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. శకుంతలాదేవి ఐదేళ్ల వయసులోనే పద్దెనిమిదేళ్ల స్టూడెంట్ చేయగలిగిన లెక్కలను సాల్వ్ చేసేవారట. గిన్నిస్ బుక్‌లో చోటు కూడా సంపాదించారామె. కేవలం మ్యాథమేటిషియన్గా మాత్రమే కాదు. ఆస్ట్రాలాజీ, వంటలు, నవలా రచనలు కూడా చేశారామె. ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్’ అనే బుక్ కూడా రాశారు శకుంతల. 83 ఏళ్ల వయసులో 2013 ఏప్రిల్‌లో శకుంతలాదేవి కన్నుమూశారు. -
శకుంతలా దేవిగా విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరో బయోపిక్కు ఓకె చెప్పారు. స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న విద్య, తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తరువాత కూడా నటిగా కొనసాగుతున్న ఈ భామ ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. తాజాగా మరో చాలెంజింగ్ రోల్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో అధికారికంగా ప్రకటించారు. అను మీనన్ దర్శకత్వంలో, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. BIG DAY 🌞! Excited to play the role of Math Genius, #ShakuntalaDevi. @vikramix @anumenon1805 and I are thrilled to bring to life the true story of 'the human computer' - a small-town Indian girl, who took the world by storm! @Abundantia_Ent In theatres - Summer 2020 pic.twitter.com/LSCipkhwir — vidya balan (@vidya_balan) 8 May 2019 -
మగనిత తత్వవేత్త
‘గే’ సెక్స్‌కు శిక్షగా రాళ్లతో కొట్టి చంపే చట్టాన్ని తెచ్చిన బ్రూనై దేశ సుల్తాన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తాజా పరిస్థితుల్లో.. ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులపై చర్చ మరింత విస్తృతం అయింది. ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి జీవించి ఉండగా ‘గే’ల హక్కులపై ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ అనే పుస్తకం రాయడానికి ఆమెను ప్రేరేపించిన అంశాలు కూడా మనదేశంలో ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి శకుంతల తండ్రితో కలిసి సర్కస్ సెంటర్లో కూర్చొని ఉంది. ఆమె చుట్టూ కళాకారులు, జంతువులు ఉన్నా ఆమె దృష్టంతా తన ముందర ఉన్న కార్డుల మీదే ఉంది. వాటినే పరిశీలిస్తోంది ఆ అమ్మాయి. శకుంతల తండ్రి సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించారు. సర్కస్‌లో పనిచేయాలనే కోరికతో ఇంటి నుంచి పారిపోయి, సర్కస్ కంపెనీలో చేరారు. అక్కడ ఆయన తాడు మీద నడిచాడు, సింహాలను ఆడించాడు, బంతులను చేతులలోకి మార్చుకుంటూ ఆడాడు. తర్వాత సర్కస్ షో పూర్తయింది. టెంట్లన్నీ తీసేశారు. అప్పుడు ఆయన కాలక్షేపం కోసం కుమార్తె ముందు పేక ముక్కలతో రకరకాల మ్యాజిక్కులు చేయడం ప్రారంభించారు. అయితే, అమ్మాయి చిన్నపిల్లనీ, ఆ మ్యాజిక్కులు అర్థం చేసుకునే వయస్సు కాదనీ అనుకున్నాడు. కాని ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఆటను తన జ్ఞాపకశక్తితో గెలుచుకుంది శకుంతల. అది చూడగానే, శకుంతల పుట్టుకతోనే గణిత శాస్త్రంలో మేధావి అని, అంకెలను బాగా గుర్తుపెట్టుకోగలదని అర్థం చేసుకున్నాడు. ఆమెకు లభించిన వరాన్ని గుర్తించి, ఇక సర్కస్‌లో పని మానేసి, కూతురిలోని నైపుణ్యాన్న వెలికి తీసుకురావాలనుకున్నారు. రోడ్డు షోలు ప్రారంభించారు, పెద్ద పెద్ద అంకెలను ఆమె ఏ విధంగా గుర్తు పెట్టుకుంటోందో తెలియచేయడం ప్రారంభించారు. ఐదు సంవత్సరాల వయసు వచ్చేనాటికే శకుంతల ఎన్నో లెక్కలను అవలీలగా చేసేసేది. తన ఆరో ఏట మైసూరు విశ్వవిద్యాలయంలో పెద్ద ప్రదర్శన ఇచ్చింది శకుంతల. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో 13 స్థానాల రెండు అంకెలను కేవలం 28 సెకన్లలో భాగించి, 26 స్థానాల అంకెను అవలీలగా చెప్పేసింది శకుంతల. ఈ ప్రశ్నను కంప్యూటర్ చేత అడిగించారు. అదీ అలాగే చూపించింది! అంతే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు శకుంతల. దానితో పాటు హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందిన శకుంతల హోమో సెక్సువాలిటీ హక్కుల కోసమూ పోరాడారు. ఆ సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. ఎందుకు మళ్లారు?! 1960 మధ్య ప్రాంతంలో, లండన్‌లో ప్రొఫెసర్లు, పరిశోధకుల ఎదుట మేథమేటికల్ స్కిల్స్ ప్రదర్శించి, భారతదేశానికి తిరిగి వచ్చారు శకుంతల. కోల్‌కత్తాలో ఐఏఎస్‌గా పనిచేస్తున్న పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు. వారి జంట చూడముచ్చటగా ఉంది అనుకున్నారు అందరూ. అయితే కొద్దికాలానికే బెనర్జీ హోమో సెక్సువల్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 21వ శతాబ్దంలోనూ ఇది పెద్ద విషయమే. మరి అప్పట్లో పెద్ద దుమారమే కదా. తాను ఒక ‘గే’ని వివాహం చేసుకున్నానని తెలుసుకున్న శకుంతలకు ప్రపంచం తల్లకిందులైపోయింది. ఈ విషయం మీద కఠినంగా ప్రవర్తించకుండా, తను బాధపడకుండా, హోమోసెక్సువాలిటీ గురించి చదవడం ప్రారంభించారు. గే కమ్యూనిటీ హక్కుల గురించి తెలుసుకున్నారు. మరికొందరు హోమోలను కలిసి, వారి మనోగతాన్ని, అనుభవాలను తెలుసుకుని, ఆ వివరాలను భద్రంగా పొందుపరిచారు, సమాజం నుంచి వారు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు, వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో గ్రహించారు. ‘గే’ హక్కుల ఐపీసీ సెక్షన్ 377ను 2018లో తీసుకువచ్చారు కాని శకుంతల ఈ విషయం గురించి 1977లోనే గొంతు విప్పారు. ‘గే’తత్వాలు, జీవన విధానాలు, జీవిత అవసరాల మీద తాను చేసిన పరిశోధనను, ఇంటర్వ్యూలను కలిపి ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పేరున పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం ద్వారా వారి సమస్యలను, ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడం శకుంతల ఉద్దేశం. అయితే అప్పట్లో ఆమె రచించిన పుస్తకానికి పెద్దగా స్పందన రాలేదు. కాని కాలంలో వచ్చిన మార్పుల కారణంగా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని హోమో సెక్సువల్స్ మీద రాసిన మొట్టమొదటి పుస్తకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాను అందుకున్న మిగతా పురస్కారాలతో పాటు, హోమో సెక్సువల్స్ గురించి ముందుగా స్పందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు శకుంతల. ‘‘నేను మనిషిని కావడమే ఈ పుస్తకం రాయడానికి నాకున్న అర్హత. ఇటువంటివారి పట్ల సానుభూతి చూపటం, భరించటం సరికాదు, వారిని అంగీకరించాలి’ అంటారు శకుంతల. ‘‘విలక్షణంగా ఉండటం ధర్మవిరుద్ధం కాదు. వీరి దగ్గరకు ఎవ్వరినీ రానీయకుండా చేయకూడదు. ఇటువంటి జీవన విధానం కూడా సృష్టిలో భాగమే. దీనిని ఎవ్వరూ వ్యతిరేకించకూడదు’ అంటారు శకుంతల. జయంతి భర్తతో విడాకులు ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’.. పుస్తకంగా వచ్చిన తరవాత రెండు సంవత్సరాలకు శకుంతల తన భర్త బెనర్జీ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత శకుంతల తనకు ఇష్టమైన గణితశాస్త్రం గురించి ప్రచారం చేస్తూ, విద్యార్థులకు లెక్కలు సులువుగా అర్థమయ్యేందుకు అనువుగా పుస్తకాలు రాశారు. శకుంతలాదేవి సంప్రదాయ విద్య నేర్వకపోయినా, తనకు సంక్రమించిన విద్య ద్వారా నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. -
అగణిత మేధావి
‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’ - శకుంతలా దేవి గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది. శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు. ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది. శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో పరిష్కరించేవారు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగాచెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది. శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు. ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్డ్ కంప్యూటర్లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు. గణిత మేధావి మాత్రమేకాదు... శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. స్వలింగ సంపర్కి అయిన వ్యక్తితో జరిగిన వివాహం నుంచి ఆమె పారిపోలేదు. దాన్ని అధ్యయనం చేసి ఈ పుస్తకం రాశారు. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది. శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు. 1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గణితంలో అగణిత మేధావిగా గుర్తింపు పొందిన ఆమె 2013 ఏప్రిల్ 21న బెంగళూరులోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె 84వ జన్మదినం రోజు గూగుల్ డూడుల్ ద్వారా తనను స్మరించుకుంది. ఈ గుర్తింపును దక్కించుకున్న అతి కొద్దిమంది భారతీయ మహిళల్లో శకుంతలాదేవి ఒకరు. అమెరికాలోని ఓ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు. ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. - విశేష్ -
శకుంతలాదేవికి గూగుల్ నివాళులు
మానవ కంప్యూటర్.. గణిత మేధావి శకుంతలాదేవి 84వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడుల్ తో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. కాలుక్యులేటర్లోని డిజిటల్ అంకెల రూపంలో గూగుల్ అనే అక్షరాలను రూపొందించి, పక్కనే ఎస్ డి అనే రెండు అక్షరాలు, శకుంతలా దేవి బొమ్మను ఉంచింది. లెక్కల్లో తిరుగులేని శకుంతలా దేవి పలుమార్లు అత్యంత వేగవంతమైన కంప్యూటర్లను సైతం చిటికెలో ఓడించి భారతీయుల గణిత మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదే అంశంపై ఆమె 1982లో గిన్నెస్ బుక్ రికార్డును కూడా సాధించారు. చిన్నతనంలో ఇంకా స్కూలుకు వెళ్లకముందే అంకెలతో ఆమె చేస్తున్న మేజిక్.. సర్కస్ లో పనిచేసే ఆమె తండ్రి కంట పడింది. అప్పటికి శకుంతలాదేవి వయస్సు మూడేళ్లే!! అప్పటినుంచి గణితంలో తిరుగులేని ప్రతిభను కనబరుస్తూ ప్రపంచప్రఖ్యాతి పొందారామె. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు. ఇంత ప్రతిభావంతురాలైన శకుంతలాదేవి.. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు. ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి యూనివర్సిటీ ఆఫ్ మైసూరులో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. రెండేళ్ల తర్వాత.. అంటే ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై యూనివర్సిటీలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.