‘శకుంతలా దేవీ’ మొదలైంది! | Vidya Balan Shakuntala Devi Shooting Started | Sakshi
Sakshi News home page

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

Published Mon, Sep 16 2019 4:54 PM | Last Updated on Mon, Sep 16 2019 4:55 PM

Vidya Balan Shakuntala Devi Shooting Started - Sakshi

కంప్యూటర్‌ కంటే వేగంగా గణించడం.. మానవ మేధస్సుకు సాధ్యపడనిది లేదని నిరూపించిన శకుంతలా దేవీ జీవతం ఆధారంగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేర్గాంచిన శకుంతలా దేవీ పాత్రలో బాలీవుడ్‌ సంచలన నటి విద్యా బాలన్‌ నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది.

‘శకుంతలా దేవీ’గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ నేడు(సెప్టెంబర్‌ 16) మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి విద్యాబాలన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్‌లో విద్యాబాలన్‌ నెం.1 పొజిషన్‌లో ఉండగా.. కంప్యూటర్‌, క్యాలికులేటర్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లుగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాకు అను మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement