బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరో బయోపిక్‌కు ఓకె చెప్పారు. స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న విద్య, తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తరువాత కూడా నటిగా కొనసాగుతున్న ఈ భామ ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు.
తాజాగా మరో చాలెంజింగ్ రోల్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో అధికారికంగా ప్రకటించారు. అను మీనన్ దర్శకత్వంలో, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
BIG DAY 🌞! Excited to play the role of Math Genius, #ShakuntalaDevi. @vikramix @anumenon1805 and I are thrilled to bring to life the true story of 'the human computer' - a small-town Indian girl, who took the world by storm! @Abundantia_Ent
— vidya balan (@vidya_balan) 8 May 2019
In theatres - Summer 2020 pic.twitter.com/LSCipkhwir
Comments
Please login to add a commentAdd a comment