సిగ్గుపడితే అంతే సంగతులు | Living life off the camera is very important for me....Vidya Balan | Sakshi
Sakshi News home page

సిగ్గుపడితే అంతే సంగతులు

Published Fri, Nov 10 2017 12:37 AM | Last Updated on Fri, Nov 10 2017 12:37 AM

Living life off the camera is very important for me....Vidya Balan

... అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌. ముఖ్యంగా సినిమా తారలకు సిగ్గు ఉండకూడదని పేర్కొన్నారామె. అందుకే.. బిడియస్తులు ఇండస్ట్రీకి రాకూడదని, వస్తే అంతే సంగతులని విద్యా సెలవిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఒక్కసారి ముఖానికి మేకప్‌ వేసుకుంటే.. ఆ క్యారెక్టర్‌ తప్ప పర్సనల్‌ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టేయాలి. రొమాంటిక్‌ సీన్‌ చేయాలంటే చేయాల్సిందే. నలుగురూ ఉన్నారు కదా అనుకుంటే ఫెయిలవుతాం. సెంటిమెంట్‌ సీన్‌లో ఏడవమంటే ఏడవాల్సిందే. సీన్‌ డిమాండ్‌ చేస్తే.. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ చెప్పాల్సిందే. ‘అయ్య బాబోయ్‌ నాకు సిగ్గండీ’ అంటే సినిమాకి న్యాయం జరగదు.

సిగ్గు, మొహమాటం, భయం.. ఈ రంగంలో పనికిరావు. బిందాస్‌గా ఉండటం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కాన్ఫిడెన్స్‌ గురించి చెప్పాలంటే.. ఒక్క సినిమా ఫీల్డ్‌లో మాత్రమే కాదు.. ఏ జాబ్‌ చేసినా అలానే ఉండాలి. అప్పుడే సక్సెస్‌ కాగలుగుతాం’’  అన్నారు విద్యాబాలన్‌. సురేశ్‌ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘తుమ్హారీ సులు’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో విద్యా పాత్ర పేరు సులు. రేడియో జాకీ క్యారెక్టర్‌ చేశారు. హౌస్‌వైఫ్‌గా ఉండే సులు అనుకోకుండా ఆర్జే జాబ్‌ ఒప్పుకుంటుంది. ఇది నైట్‌ డ్యూటీ. జాబ్‌లో చేరాక ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో సినిమా నడుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement