
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పింక్. ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్‌లో అజిత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.
ఈ పింక్ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయబోతున్నాడని.. కాదు అవన్ని రూమర్సే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయనున్నాడు. ఇందులో ఓ ప్రముఖ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్ నటించబోతోందని తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాతో బిజీగా ఉన్నారు. విద్యాబాలన్ ఇప్పటికే యన్.టి.ఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment