పింక్‌ రీమేక్‌ మొదలైంది.! | Ajith Starts Shooting for Pink Remake | Sakshi
Sakshi News home page

పింక్‌ రీమేక్‌ మొదలైంది.!

Published Sat, Feb 16 2019 4:00 PM | Last Updated on Sat, Feb 16 2019 4:00 PM

Ajith Starts Shooting for Pink Remake - Sakshi

బాలీవుడ్ లో సూపర్‌హిట్ అయిన పింక్‌ సినిమాను అజిత్‌ హీరోగా సౌత్‌ లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కనిపించిన పాత్రలో సౌత్‌లో అజిత్‌ నటించనున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉత్తరాది నటి విద్యాబాలన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో అజిత్ కూడా పాల్గొననున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement