
విద్యా బాలన్, సాయి పల్లవి
జయలలిత, శశికళ మధ్య స్నేహం గురించి చాలానే విన్నాం. రాజకీయ రాగాల్లో జయలలిత అను పల్లవి అయితే శశికళ పల్లవి అనేటంత. జయలలిత కథ చెప్పాలంటే శశికళ లేనిదే ఆ కథకు ఓ పరిపూర్ణత ఉండదు. అంతలా జయ జీవితంలో ఓ కీలక వ్యక్తిగా మారారు ఆమె. ఇప్పుడు తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా నాలుగు సినిమాలు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఒకటి. విబ్రీ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇందులో జయలలిత పాత్రను విద్యా బాలన్ పోషించనున్నారని కోలీవుడ్‌లో టాక్. లేటెస్ట్‌గా శశికళ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట దర్శకుడు విజయ్. ఆల్రెడీ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘దియా’ (తెలుగులో ‘కణం’) ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు సాయిపల్లవి. ఇప్పుడు శశికళ పాత్రకు ఆమె పేరును పరిశీలిస్తున్నారట దర్శకుడు. మరి విజయ్ తెరకెక్కించనున్న ఈ రాజకీయ చదరంగ రాగాల్లో విద్యా ‘అనుపల్లవి’, సాయి ‘పల్లవి’ అవుతారా? అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment