ఇందిరాగాంధీ ,విద్యాబాలన్
నవ్వు ఒకటి కాదు. దేహాకృతి ఒకటి కాదు. హావభావాలు ఒకటి కాదు. మరెలా ఆవిడ పాత్రను ఈవిడ పోషించడం? బాలన్.. ఇందిర పాత్రను పోషించగలరా లేదా అన్నది తర్వాతి సంగతి. ముందైతే ఈ సంగతి చెప్పండి. నటనలో ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని అనుకరించడానికి ఈ పోలికలన్నీ నిజంగా అవసరమా? ప్రధానిగా దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు, చిన్న కొడుకు సంజయ్ గాంధీతో తలనొప్పులు వచ్చినప్పుడు, రాజకీయాల్లో కల్లోలం చెలరేగినప్పుడు ఇందిరాగాంధీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో.. అంత స్ట్రాంగ్‌నెన్ లైఫ్‌లో ప్రతి మహిళలోనూ ఉంటుంది. విద్యాబాలన్‌లోనూ ఉండి తీరుతుంది.
ఆ శక్తి చాలు కదా ఇందిరగా బాలన్ నటించానికి. సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిర : ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకానికి విద్యాబాలన్ రైట్స్ కొనుక్కున్నారు. దాంతో ఆ పుస్తకాన్ని సినిమాగా తియ్యబోతున్నారా, ఇందిరగా విద్యాబాలన్ సూట్ అవుతారా అనేది ఇప్పుడు టాపిక్ అయింది. రైట్స్ అయితే బాలన్ దగ్గరున్నాయి. విద్యే ఇందిరగా నటించాలనేముందీ? ఇంకెవరి చేతైనా యాక్ట్ చేయించవచ్చు కదా.. నిర్మాతగా మారి!
Comments
Please login to add a commentAdd a comment