అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి! | Akshay Kumar Mission Mangal Crosses Rs 200 Cr Mark at The Box Office | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

Published Sat, Sep 14 2019 9:46 AM | Last Updated on Sat, Sep 14 2019 9:46 AM

Akshay Kumar Mission Mangal Crosses Rs 200 Cr Mark at The Box Office - Sakshi

బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. కమర్షియల్ జానర్‌ను పక్కన పెట్టి సందేశాత్మక చిత్రాలు చేస్తున్న అక్షయ్‌ మంచి విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా మిషన్‌ మంగళ్ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత శాస్త్రవేతల మామ్‌ ప్రయోగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా బాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి, నిత్య మీనన్, హె.ఆర్.దత్తాత్రేయ ముఖ్య పాత్రలు పోషించారు.

ఆర్ బాల్కి నిర్మించిన ఈ సినిమాకు జగన్‌ శక్తి దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. సినిమా విడుదల అయి రోజులవుతున్నా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా, 29 రోజుల్లో 200 కోట్ల మార్క్‌ను అందుకోవటం విశేషం. అంతేకాదు అక్షయ్ కెరీర్ లో 200 కోట్ల క్లబ్ లో చేరిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం. 

తొలి వారంలోనే 128.16 కోట్లు వసూళు చేసిన 'మిషన్ మంగళ్'.. రెండో వారం 49.95 కోట్లు, మూడో వారం 15.03 కోట్లు, నాలుగో వారం 7.02 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, హోప్ ప్రొడక్షన్స్ తో  పాటు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది, తనీష్ బాఘ్చి సంగీతమందిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement