
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించనున్నారు. తాజాగా సినిమాలో ఆమెలుక్‌ను రివీల్ చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు విద్యా.
మేకప్ రూమ్‌లో అద్దం ముందు కూర్చున్న తన ఫోటోకు ‘నేనేం చూస్తున్నాను..?’ అన్న కామెంట్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండంగా కల్యాణ్ రామ్.. హరికృష్ణగా, రానా దగ్గుబాటి.. చంద్రబాబు నాయుడిగా, సుమంత్.. నాగేశ్వరరావు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను 2019 జనవరిలో రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment