inflammatory
-
ఢిల్లీ పోలీసులకు ఆ దమ్ము లేనట్లుంది: ఒవైసీ
హైదరాబాద్: విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంతో ఢిల్లీ పోలీసులు, ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఒవైసీ.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారాయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహమాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా పేర్లను సైతం చేర్చారు. ‘‘ఢిల్లీ పోలీసులు సైడ్‌ఇజం లేదా బ్యాలెన్స్ వాద్ సిండ్రోమ్స్‌తో బాధపడుతున్నట్లు ఉన్నారు. ఒక పక్క ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్యపెట్టడానికి.. రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. 1. I’ve received an excerpt of the FIR. This is the first FIR I’ve seen that’s not specifying what the crime is. Imagine an FIR about a murder where cops don’t mention the weapon or that the victim bled to death. I don’t know which specific remarks of mine have attracted the FIR pic.twitter.com/0RJW1z71aN — Asaduddin Owaisi (@asadowaisi) June 9, 2022 నా వరకు ఎఫ్ఐఆర్లో నేరం ఏంటో కూడా పేర్కొనలేదు. ఇలా ఎఫ్ఐఆర్ను చూడడం ఇదే మొదటిసారి. విద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం.. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ఒక్కటి కాదు. ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై కేసులు పెట్టే దమ్ములేనట్లు ఉంది. అందుకే విషయాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు బహుశా హిందూవాదులను కించపరచకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారేమో అంటూ వరుస ట్వీట్లు చేశారు ఒవైసీ. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేతపై కేసు నమోదు -
పిల్లల్లోనూ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్
సాక్షి, హైదరాబాద్: అదృష్టవశాత్తు పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నా కొద్దిమందిలో మాత్రం కోలుకున్న తర్వాత ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరు పెద్దల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమే టరీ సిండ్రోమ్ వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటోంది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితి త్తులు, గుండె తదితర ముఖ్యమైన భాగాల న్నింటిపైనా ఇది ప్రభావం చూపుతోంది. రక్తంలో క్లాట్లు (గడ్డలు) ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న పిల్లలపైనా మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ దాడి చేస్తోందని పిల్లల వైద్య నిపుణులు గుర్తించారు. కోలు కున్న 3 వారాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోం దని అంటున్నారు. కవాసాకి అనే వ్యాధి కూడా పిల్లల్లో కనిపిస్తోందంటున్నారు. సిండ్రోమ్, కవాసాకి లక్షణాలు దగ్గరగా ఉంటాయి. అయి తే సిండ్రోమ్‌లో అన్ని అవయవాలపైనా వైరస్ తీవ్రత ప్రభావం చూపుతుంది. కవాసాకిలో మాత్రం గుండెపైనే ప్రభావం చూపుతుంది. గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల్లో 42 మందికి రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో పదేళ్ల లోపు పిల్లలు 4.18 శాతం మంది ఉండగా, 11 నుంచి 20 ఏళ్లలోపు వారు 8.95 శాతం మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో 42 మంది మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో గాంధీ ఆస్పత్రిలో 38, నీలోఫర్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. వారిలో నలుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. మిగిలిన పిల్లలకు వైద్యం చేస్తున్నారు. సిండ్రోమ్, కవాసాకిలతో పెద్దగా ప్రమాదం లేకున్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చాలావరకు యాస్పిరిన్, స్టెరాయిడ్స్‌తో ఇది తగ్గిపో తుందని రెండ్రోజుల కిందట లాన్సెట్ అనే ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ స్పష్టం చేసింది. పిల్లల్లో సిండ్రోమ్ లక్షణాలు ♦జ్వరం ♦వాంతులు ♦డయేరియా ♦కడుపులో నొప్పి ♦శరీరంపై దద్దుర్లు ♦కళ్లు ఎర్రగా మారిపోవడం ♦పెదాలు, నాలుక మరింత ఎర్రగా మారడం లేదా వాపు ♦నీరసంగా ఉండటం ♦పాదాలు, చేతులు ఎర్రగా మారడం లేదా వాపు ♦కొందరిలో ఛాతీ నొప్పి, తీవ్ర నిస్సత్తువ ♦శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ♦తీవ్రత పెరిగితే పెదాలు, ♦ముఖం నీలం రంగులోకి మారడం, తీవ్రమైన కడుపునొప్పి లక్షణాలను గుర్తించాలి కరోనా తగ్గాక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సిండ్రోమ్ వల్ల పిల్లలకు పెద్దగా ప్రమాదం లేకపోయినా లక్షణా లుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నీలోఫర్‌లో ఇటువంటి కేసులకు మేము వైద్యం చేశాం. వారిలో కొందరిని గాంధీ ఆస్పత్రికి కూడా రిఫర్ చేశాం. – డాక్టర్ నరహరి, అసోసియేట్ ప్రొఫెసర్, నీలోఫర్ ఆస్పత్రి, హైదరాబాద్ -
మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు!
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఇకపై మహిళలు మాత్రమే మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు వస్తున్నాయి. మగాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకూ బోలెడన్ని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు డైమిథడ్రోలోన్ అండీకానోయేట్ అనే రసాయనం దీన్ని సాధ్యం చేసింది. దీని సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇష్టపడరని.. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి సామర్థ్యమున్న పద్ధతి కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్ తెలిపారు. తొలిదశ ప్రయోగాల్లో తాము వంద మంది పురుషులను ఎంచుకుని మూడు వేర్వేరు మోతాదుల్లో మందు అందించామని, అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా మందగించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ కొంత నష్టపోవడంతో పాటు కొద్దిగా ఒళ్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు. -
బోద.. తీరని బాధ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైలేరియా సమస్య తీవ్రంగా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 47,476 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. వీరిలో బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సమస్యతో బాధపడేవారు 46,476 మంది, వరిబీజంతో సతమతమయ్యేవారు 1,042 మంది ఉన్నారు. పరిసరాల అపరిశుభ్రతతో వృద్ధి చెందే క్యూలెక్స్ దోమకాటు బోదకాలు వ్యాధికి కారణమవుతోంది. మనిషి శరీరంలోకి క్రిమి (పారాసైట్) నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ మూడు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సోకినవారి కాలు పెద్దగా మారుతుంది. పురుషుల్లో వరిబీజం (హైడ్రోసెల్), మహిళల్లో రొమ్ముల బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైలేరియాను నిర్లక్ష్యం చేస్తే రోజురోజుకూ కాలు పెద్దగా మారి నడవలేని స్థితికి చేరుతుంది. ఫైలేరియా సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒకేసారి నాలుగు వేల మంది రక్త నమూనాలను సేకరిస్తారు. ఫైలేరియాకు కారణమయ్యే క్రిమి మనుషుల రక్తనాళాల్లోకి రాత్రిపూట మాత్రమే విస్తరిస్తుంది. దీంతో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటలలోపు మాత్రమే రక్త నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. కాలివేళ్ల నుంచి ఈ రక్త నమూనాలను తీసుకుంటారు. పరీక్షలో 40 కంటే ఎక్కువగా పాజిటివ్ అని వస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా భావిస్తారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ 5 జిల్లాల్లోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిని సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం (హై రిస్క్ జోన్)గా వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలు వాడాలి.. ఫైలేరియా సోకే ప్రాంతాల్లోని వారు వరుసగా ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలను వాడితే సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. బోదకాలు సోకిన శరీర భాగాలను నిత్యం నీటితో శుభ్రపర్చాలి. తప్పనిసరిగా ఆయింట్మెంట్ రాసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. – డాక్టర్ ఎస్.ప్రభావతి, ఫైలేరియా నిర్మూలన రాష్ట్ర అధికారి -
ప్రమాదాలకు దారితీసే నిద్ర అలవాట్లు..
న్యూయార్క్ః నిద్రలేమి, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఆరునుంచి, ఎనిమిది గంటలు నిద్రపోవాలని, లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు గంటలకంటే అతి తక్కువగా నిద్రపోవడం ద్వారా అనేక ఆనారోగ్యాలు దరిచేరడంతోపాటు మరణాలు సైతం సంభవిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. కలత నిద్ర, నిద్రలో ఆటంకాలు అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. చాలీ చాలని నిద్రతోపాటు, అత్యధికంగా కానీ, అతి తక్కువగా కానీ నిద్రపోవడం కడుపులో మంట వంటి ఇతర ఆనారోగ్యాలకు దారి తీస్తాయని తాజా అధ్యయనాలద్వారా కనుగొన్నారు. తగిన నిద్ర లేకపోవడం అనేది ఓ మహమ్మారి వంటిది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భావిస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామంతోపాటు నిద్ర ఎంతో అవసరమని అమెరికా లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. నిద్రాభంగం, నిద్రలేమి శరీరంలో అధిక కొవ్వును కలుగజేయడం, కడుపులో మంటను సృష్టించడంతోపాటు, ప్రవర్తనపై కూడ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇర్విన్ చెప్తున్నారు. ఇన్ ఫ్లమేషన్.. శరీరంలోని సి-రియాక్టివ్ ప్రొటీన్ ను, ఇంటర్‌ల్యూకిన్ 6 తోపాటు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల్లో తెలిపారు. అత్యధిక, అత్యల్ప నిద్ర కూడా శరీరంలో సీఆర్పీని పెంచుతాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కనీసం 6 నుంచీ 8 గంటల వరకూ నిద్రపోవాలని అధ్యయనకారులు చెప్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 50000 మంది భాగస్వాములయ్యారని, అంతేకాక పలు వైద్య చికిత్సా వ్యాసాలపై కూడా విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించినట్లు ఇర్విన్ తెలిపారు. నిద్ర అలవాట్ల ఆధారంగా చికిత్సలు అందించి పలు అనారోగ్యాలను తగ్గించవచ్చని పరిశోధకులు నిర్థారించారు.