సహజత్వమే సౌందర్యం
బ్యూటిప్స్
మీ ముఖంలాగే మీ చేతులు, కాళ్లు కూడా తెల్లగా మెరవాలని ఆశ పడుతున్నారా? అయితే మూడు టీస్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్‌వాటర్ తీసుకోండి. ఆ మిశ్రమానికి కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇటు జిడ్డు చర్మం, అటు మొటిమలతో బాధ పడేవారు సహజ సిద్ధమైన మంత్రం జపించండి. ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది.
ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా టమాటో రసాన్ని కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చక్కటి ఫలితం దక్కుతుంది.