Rosewater
-
దాహంగా లేదా? అయినా తాగాలి
వర్షాకాలం చర్మ సమస్యలు తరచూ బాధిస్తుంటాయి. అయితే వంటగదిలో వాడే కొన్ని దినుసులు, పదార్థాలతో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం. ►వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీటితో ముఖాన్ని తప్పక శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునేముందు రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని ముఖమంతా తుడిచి, నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తల వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మ కాంతి పెరుగుతుంది. ►ఈ కాలం ఫౌండేషన్, పౌడర్లను ఎంత తక్కువ వాడితే చర్మానికి అంత మంచిది. నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్లను కూడా తగ్గించాలి. తరచూ నీళ్లలో తడవడం వల్ల చర్మంపై పోర్స్ (రంధ్రాలు) తెరుచుకుంటాయి. ఇలాంటప్పుడు ఫౌండేషన్, పౌడర్ పోర్స్‌లోకి వెళ్లిపోయి ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, యాక్నె సమస్యలు తలెత్తుతాయి. ►టొమాటో రసం ముఖానికి, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మంపై జిడ్డు తగ్గుతుంది. పైనాపిల్, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు లేదా జ్యూస్‌లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ►ఓట్స్‌లో తేనె, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసి ముఖానికి చేతులకు, పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మకాంతి పెరుగుతుంది. ►తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు సమపాళ్లలో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని పదినిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. పొడి చర్మానికి ఇది మేలైన ప్యాక్. పొడి చర్మం గలవారు బాదంపప్పు పొడి, తేనె కలిపి కూడా వాడుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారైతే ఆరెంజ్ ఆయిల్, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ►ఈ కాలం రకరకాల అలర్జీలు తలెత్తుతుంటాయి. ఇవి చర్మం సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లు గల సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ►ఈ కాలం దాహంగా అనిపించదు. కానీ, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడడం సమస్య దరిచేరదు. చర్మం పొడిబారి జీవం లేకుండా ఉంటే పైపైన మాయిశ్చరైజర్ వాడాలి. జిడ్డు చర్మం అయితే రోజుకు రెండు సార్లు తప్పక శుభ్రపరుచుకోవాలి. -
బ్యూటిప్స్
మృదువైన చర్మం కోసం... ►పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది. ►పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. ►స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ►చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం.. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. -
కళ్లజోడు మచ్చలకు కలబంద
కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే... ►కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలుతగ్గుతాయి ►మచ్చలపై తేనె రాసి, 10–15 నిమిషాల తర్వాతశుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటేమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి ►రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసిబాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడువల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు ►బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్నచోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి ►నారింజ తొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్న చోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలోని సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్నిచుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈవిధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగాతగ్గిపోతాయి ►స్ట్రాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
బ్యూటిప్స్
శనగపిండితో అందం... టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన ముఖానికి పట్టించాలి. ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. బ్లాక్ హెడ్స్ నివారణ కోసం... అయిదారు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్‌తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్‌ప్యాక్ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ పెరుగులో టీ స్పూన్ బియ్యంపిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. -
ఆకుపచ్చని కాంతి
గ్రీన్ టీ అంతర్గత అవయవాల ఆరోగ్యానికే కాదు మేని సౌందర్యానికీ ఉపయోగించవచ్చు. చర్మ మృదుత్వాన్ని, కాంతిని పెంచుకోవచ్చు. గ్రీన్ టీ క్లెన్సర్: గ్రీన్ టీ బ్యాగ్‌తో తేనీరు తయారుచేసుకొని సేవించాలి. ఆ టీ బ్యాగ్ చల్లారిన తర్వాత, గట్టిగా పిండాలి. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖం, మెడ భాగాలపై మెల్లగా 2 నిమిషాల సేపు రుద్దాలి. అదే టీ బ్యాగ్తోనూ ముఖమంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మలినాలు తొలగి, వడలిన ముఖం తాజాగా మారుతుంది. గ్రీన్ టీ స్టీమ్ ఫేసియల్: ఫేసియల్ సమయంలో సాధారణ వేడి నీటితో ముఖానికి ఆవిరిపడుతుంటారు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను కట్ చేసి ఆకును మాత్రమే వేయాలి. గిన్నెను కిందకు దించి, తలను ముందుకు వంచి, పైన టవల్‌ను కప్పుకోవాలి. ఇలా వచ్చే ఆవిరిని 3–4 నిమిషాలు మాత్రమే ముఖానికి పట్టాలి. (వేడి భరించగలిగేటంత దూరంలో ఉండాలి). గ్రీన్ టీ రోజ్ వాటర్: రోజ్‌వాటర్‌ను (మార్కెట్లో లభిస్తుంది) వేడి చేసి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉంచాలి. 5 నిమిషాల తర్వాత టీ బ్యాగ్ తీసేసి, మిశ్రమం చల్లబడ్డాక, గాలిచొరబడని బాటిల్లో పోసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. అలసిన కళ్లకు విశ్రాంతి, వడలిన చర్మానికి తాజా దనం రావడానికి ఈ గ్రీన్ టీ రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని, తుడుచుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల వయసుపైబడిన కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి. ఎండకు కందిన చర్మం సహజకాంతిని నింపుకుంటుంది. -
బ్యూటిప్స్
కొన్ని గులాబి రేకులను గంటపాటు పాలలో నానబెట్టాలి. తర్వాత పాలలోంచి తీసేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పాలక్రీమ్, తేనె కలిపి పెదవులకు పూసి... అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. చిట్లిపోయి ఇబ్బంది పెడుతోన్న పెదవులు మళ్లీ అందంగా, ఆరోగ్యంగా అవ్వడానికి ఇది మంచి చిట్కా. {దాక్షపళ్లను మెత్తగా చిదిమి, కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంతో పెదవులను రుద్దుకుంటే పగుళ్లు పోయి, పెదవులు మృదువుగా తయారవుతాయి. బీట్రూట్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత క్రీమ్, తేనె, రోజ్‌వాటర్ కలిపి పెదవులకు రాయాలి. గంట తర్వాత కడిగేసి, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే... పెదవులు పొడిబారడం, చిట్లటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో రోజ్‌వాటర్, తేనె కలిపి... ఆ మిశ్రమంతో పెదవులను బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే వారం రోజుల్లో చిట్లిన పెదవులు మామూలుగా అయిపోతాయి. -
బ్యూటిప్స్
గుప్పెడు వేపాకులను మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో మూడు చెంచాల పసుపు వేసి కలిపి, పాదాలకు పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఓ ప్యాకెట్ షాంపూ, నాలుగు చెంచాల ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇందులో పాదాలను పావుగంట పాటు నానబెట్టి, తర్వాత శుభ్రంగా తుడిచేసుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే పాదాలు పగలకుండా ఉంటాయి. చెంచాడు నిమ్మరసంలో, కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలిపి పాదాల పగుళ్లకు పూయాలి. రాత్రంతా పాదాలను అలా ఉంచుకుని, ఉదయం కడిగేసుకోవాలి. వారం పది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.కీరదోసను, బంగాళదుంపను కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గుతాయి. రెండు మూడు చెంచాల బియ్యాన్ని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో కాసింత తేనె, వెనిగర్ వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమం పగుళ్లను మాన్పి పాదాలను స్మూత్‌గా చేస్తుంది.అరటిపండుని మెత్తని గుజ్జులా చేసి, అందులో కాస్తంత తేనె, రోజ్‌వాటర్ కలిపి పగుళ్లు ఉన్నచోట తరచూ పూస్తే... పగుళ్లు, వాటి వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. -
పెదవుల సంరక్షణ
బ్యూటిప్స్ చలికాలం పెదవులు పొడి బారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుం టాయి. వాటి నివారణకు కొన్ని చిట్కాలు. అలోవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలోవెరా జెల్‌ని రాస్తే మృదువుగా అవుతాయి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. క్యాబేజీని ఉడికించిన నీరు పెదవులకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. కమిలిన పెదవుల చర్మం మృదువుగా అవుతుంది. కొత్తిమీర రసం పెదవులకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. వారంలో మూడు సార్లు ఈ విధంగా చేస్తే పెదవులపై నల్లని మచ్చలు తగ్గిపోతాయి. -
సహజత్వమే సౌందర్యం
బ్యూటిప్స్ మీ ముఖంలాగే మీ చేతులు, కాళ్లు కూడా తెల్లగా మెరవాలని ఆశ పడుతున్నారా? అయితే మూడు టీస్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్‌వాటర్ తీసుకోండి. ఆ మిశ్రమానికి కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇటు జిడ్డు చర్మం, అటు మొటిమలతో బాధ పడేవారు సహజ సిద్ధమైన మంత్రం జపించండి. ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది. ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా టమాటో రసాన్ని కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చక్కటి ఫలితం దక్కుతుంది. -
చర్మకాంతికి 5 ప్యాక్స్...
చర్మానికి మేలు చేసే గుణాలు ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలలో పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొన, పాలు, బాదంపప్పు, తేనె, నిమ్మరసం, క్యారట్లతో చర్మకాంతిని పెంచుకోవచ్చు. ఎగ్ ప్యాక్: టీ స్పూన్ గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలో వేసి, అందులో అర టీ స్పూన్ పాల మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి పెరుగుతుంది. పాలు: ముందు రోజు రాత్రి ఐదు బాదంపప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే పై పొట్టు తీయాలి. వీటిని మెత్తగా రుబ్బి, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని వదలగొట్టి, చర్మకాంతిని పెంచుతాయి. బాదం పప్పు లోని సహజమైన నూనెలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. తేనె: టేబుల్ స్పూన్ తేనెలో అరముక్క నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి, 10 -15 నిమిషాలు ఉండాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మంపై మలినాలను తొలగించడంలో మైల్డ్ ఫేస్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. కాంతి పెరుగుతుంది. క్యారెట్: బంగాళదుంప, క్యారెట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు బేకింగ్ సొడా, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకొని రెండు నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. రోజ్‌వాటర్: రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక చుక్క గ్లిజరిన్, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది ఉండతో అద్దుకుంటూ ముఖం, మెడకు రాసి, తుడవాలి. ఇది రోజంతా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం నివారిస్తుంది. చర్మం ముడతలు తగ్గి, యవ్వనకాంతితో మెరుస్తుంది. -
వండర్ ప్యాక్స్
చర్మం పొడిబారడం ఈ కాలం ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేసుకొని మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల జొజోబా ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది), రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, టీ స్పూన్ తేనె ఈ మూడూ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10-15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి చర్మం గలవారికి ఇది మహత్తరమైన ఫేస్‌ప్యాక్. రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి, అరకప్పు రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ప్యాక్ రోజూ వేసుకోవడం వల్ల ముఖంపై మురికి, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది.ఈ కాలం సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా ఉపయోగపడేది దోస లేదా కీర. వీటిని గుజ్జు చేసి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గల వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. -
బ్యూటిఫుల్ టిప్స్ ఆఫ్ ఎ బ్యూటీ క్వీన్
‘‘మన సౌందర్య సంరక్షణను వంటింటి నుంచే మొదలుపెట్టొచ్చు. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల కన్నా ఇంట్లో తయారు చేసుకునేవే మేలు’’ అని నటి ప్రియాంకా చోప్రా అంటున్నారు. అదే కాదు... మరికొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు... ** ముఖారవిందం తళుకులీనుతూ ఉండాలంటే పెద్దగా హైరానా పడాల్సిన అవసరంలేదు. జస్ట్ కొంచెం చందనం పొడి, పసుపు పొడిని తీసుకుని, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని మొహానికి పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత అద్దంలో చూసుకుంటే, మీరే ఆశ్చర్యపోయే రేంజ్లో తళుకులు కనిపిస్తాయి. ** కొంచెం రంగు తక్కువ ఉన్నవారికి ఓ సలహా. రెండు టేబుల్‌స్పూన్స్ ఓట్మీల్, పసుపు పొడిని కొంచెం పెరుగులో కలపాలి. ఆ పేస్ట్‌ని మొహానికి పట్టించాలి. సుమారు అరగంట తర్వాత కడిగితే, మీ చర్మం కాంతిమంతంగా ఉంటుంది. ** జుత్తు నిగనిగలాడాలంటే చిన్న చిట్కా. చుండ్రు ఉన్నవాళ్లకి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. అరకప్పు పెరుగుకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, జుత్తుకి పట్టించాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే, జుత్తు పట్టులా ఉంటుంది. చుండ్రు గాయబ్. -
అద్దండి... రుద్దండి...
చక్కెరతో చెక్ కాఫీలో చక్కెర తక్కువైతే చుక్క కూడా తాగలేం. చక్కెరతో నోరు తీపి చేయనిదే ఏ శుభవార్తనీ చెప్పలేం. అయితే చక్కెర రుచినిచ్చేదీ, సంతోషాన్ని రెట్టింపు చేసేది మాత్రమే కాదు... ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా. చేతికి నూనె, గ్రీజు లాంటివి అంటుకుని జిడ్డు వదలడం లేదనుకోండి. అప్పుడు కాసింత చక్కెరను, కొన్ని చుక్కల నీటిని చేతుల్లో వేసుకుని బాగా రుద్దుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకుంటే జిడ్డు మాయమైపోతుంది; వెనిగర్‌లో పంచదార వేసి, కరిగిన తర్వాత ఆ మిశ్రమంతో తుడిస్తే, మొజైక్ నేలమీద ఉన్న మరకలు తొలగిపోతాయి; దుస్తుల మీద మొండి మరకలు ఉంటే... టొమాటో రసంలో చక్కెర కలిపి దాన్ని మరకమీద వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత బాగా రుద్దితే మరకలు వదిలిపోతాయి; రోజ్‌వాటర్‌లో చక్కెర వేసి, కరిగిన తర్వాత దానితో వెండి వస్తువులను తోమితే తళతళలాడతాయి; బేకింగ్ సోడా, చక్కెర కలిపి మెత్తని పొడిలా చేసుకుని, దాన్ని నీటిలో కలిపి చిక్కని ద్రావకంలా చేసుకోవాలి. దీనితో కనుక గిన్నెలు కడిగితే... జిడ్డు, మసి పోయి పాత్రలు మెరిసిపోతాయి; నిమ్మరసంలో చక్కెర వేసి కరగనివ్వాలి. ఓ స్పాంజిని ఈ ద్రావకంలో ముంచి తుడిస్తే వస్తువులు, గిన్నెలు, బట్టలు... దేనిమీద పడిన తుప్పు మరకలైనా వదిలిపోతాయి. అలాగే దీనితో కిచెన్‌లో బండలు తుడిస్తే మురికిపోయి బండలు శుభ్రపడతాయి. -
అందమె ఆనందం
పొడి జుత్తు కలవారు కొబ్బరి పాలలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే పొడిదనం పోయి జుత్తు మృదువుగా తయారవుతుంది. జుత్తు రాలడాన్ని అరికట్టాలంటే... తలస్నానం చేసేముందు బియ్యం కడిగిన నీళ్లతో తడపాలి. కాసేపు అలానే నాననిచ్చి ఆపైన కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలపడి జుత్తు రాలడం ఆగుతుంది. -
అందం
పొడి జుత్తు కలవారు కొబ్బరి పాలలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే పొడిదనం పోయి జుత్తు మృదువుగా తయారవుతుంది. జుత్తు రాలడాన్ని అరికట్టాలంటే... తలస్నానం చేసే ముందు బియ్యం కడిగిన నీళ్లతో తడపాలి. కాసేపు అలానే నాననిచ్చి ఆపైన కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలపడి జుత్తు రాలడం ఆగుతుంది. వ్యాక్సింగ్ చేశాక కొన్నిసార్లు చేతుల మీద, కాళ్ల మీద నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గుడ్డు తెల్లసొనలో తేనెను కలిపి రాసుకుంటే మచ్చలు మాయమవుతాయి. -
గులాబీలాంటి అందం
అందమె ఆనందం వాతావరణం మారుతున్నప్పుడు ఆ ప్రభావం చర్మం మీద ప్రధానంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముందుగా పెదవులు తడారిపోవడం, చర్మంపై మృతకణాలు తేలడం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఇలాంటప్పుడు... పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. పది-పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది. టేబుల్ స్పూన్ అల్లం తరుగు, స్పూన్ కొత్తిమీర, స్పూన్ లెమన్ జిస్ట్ (నిమ్మకాయ పై తొక్కను తురిమినది), రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, గుప్పెడు గులాబీల రేకలు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మస్లిన్ క్లాత్‌లో వేసి గట్టిగా ముడివేయాలి. ఈ మూటను వేడినీళ్లలో వేసి, ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. సువాసన తాజాదనం అనుభూతిని ఇస్తుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది.