బ్యూటిఫుల్ టిప్స్ ఆఫ్ ఎ బ్యూటీ క్వీన్
‘‘మన సౌందర్య సంరక్షణను వంటింటి నుంచే మొదలుపెట్టొచ్చు. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల కన్నా ఇంట్లో తయారు చేసుకునేవే మేలు’’ అని నటి ప్రియాంకా చోప్రా అంటున్నారు. అదే కాదు... మరికొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు...
** ముఖారవిందం తళుకులీనుతూ ఉండాలంటే పెద్దగా హైరానా పడాల్సిన అవసరంలేదు. జస్ట్ కొంచెం చందనం పొడి, పసుపు పొడిని తీసుకుని, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని మొహానికి పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత అద్దంలో చూసుకుంటే, మీరే ఆశ్చర్యపోయే రేంజ్‌లో తళుకులు కనిపిస్తాయి.
** కొంచెం రంగు తక్కువ ఉన్నవారికి ఓ సలహా. రెండు టేబుల్‌స్పూన్స్ ఓట్‌మీల్, పసుపు పొడిని కొంచెం పెరుగులో కలపాలి. ఆ పేస్ట్‌ని మొహానికి పట్టించాలి. సుమారు అరగంట తర్వాత కడిగితే, మీ చర్మం కాంతిమంతంగా ఉంటుంది.
** జుత్తు నిగనిగలాడాలంటే చిన్న చిట్కా. చుండ్రు ఉన్నవాళ్లకి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. అరకప్పు పెరుగుకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, జుత్తుకి పట్టించాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే, జుత్తు పట్టులా ఉంటుంది. చుండ్రు గాయబ్.