Glycerin
-
నునుపైన పాదాల కోసం
చలికాలం పాదాల పగుళ్ల సమస్య ఎక్కువ. చర్మం త్వరగా పొడిబారడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికం. పగుళ్ల వల్ల మడమల్లో నొప్పి కూడా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, గోరువెచ్చని నీళ్లు, ప్యుమిక్ స్టోన్.. తీసుకోవాలి. ఒక వెడల్పాటి టబ్బు లేదా బేసిన్ లాంటిది తీసుకొని దానిని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. దాంట్లో ఉప్పు, 4టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను 15 నిమిషాల సేపు ఉంచాలి. ప్యుమిక్‌స్టోన్ తీసుకొని పాదాల అడుగున, మడమలను రుద్దాలి.మరొకపాత్రలో టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్‌వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. పడుకునేముందు పాదాలను తడి లేకుండా తుడిచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాయాలి. పాదాలకు సాక్స్ తొడగాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను కడగాలి. వారంలో కనీసం మూడు రోజులైనా ఈ విధంగా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ల సమస్య తగ్గిపోతుంది. -
చలికాలం... మృదువైన చర్మం కోసం...
బ్యూటిప్స్ పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది. పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతివంతం అవుతుంది. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చలికాలంలో పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం..కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. -
సహజత్వమే సౌందర్యం
బ్యూటిప్స్ మీ ముఖంలాగే మీ చేతులు, కాళ్లు కూడా తెల్లగా మెరవాలని ఆశ పడుతున్నారా? అయితే మూడు టీస్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్‌వాటర్ తీసుకోండి. ఆ మిశ్రమానికి కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇటు జిడ్డు చర్మం, అటు మొటిమలతో బాధ పడేవారు సహజ సిద్ధమైన మంత్రం జపించండి. ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది. ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా టమాటో రసాన్ని కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చక్కటి ఫలితం దక్కుతుంది. -
కోమలం మృదుత్వం
బ్యూటిప్స్ నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగా అలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. -
ముడతలు తగ్గాలంటే...
అందమె ఆనందం గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది. రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది.