కోమలం మృదుత్వం
బ్యూటిప్స్
నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగా అలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి.
గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.