కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం.
విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి.
టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?
ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.
అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?
టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.
టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment