Tomato 100 KG
-
సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి. టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది. -
సెంచరీ కొట్టిన టమాటా..
-
మండుతున్న ధరలు.. 2 వేల కిలోల టమాటా లోడుతో పరారీ
సాక్షి, బెంగళూరు: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. బెంగళూరులో టమాటాలతో ఉన్న బొలెరో వ్యాన్‌తో దుండగులు పరారయ్యారు. చిత్రదుర్గకు చెందిన రైతులు బొలెరో వాహనంలో టమాటా లోడుతో బెంగళూరు ఆర్‌ఎంసీకి వచ్చారు. మార్కెట్ యార్డులో వాహనాన్ని నిలిపి టీ తాగడానికి వెళ్లారు. ఇదే అదనుగా ముగ్గురు వ్యక్తులు ఆ వ్యాన్‌ను స్టార్ట్ చేశారు. అడ్డగించగా రైతులే తమ వాహనాన్ని ఢీకొట్టారంటూ బుకాయించారు. దెబ్బతిన్న తమ వాహనం చూపిస్తామంటూ రైతులను కూడా బొలెరోలోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక రైతులను బయటకు తోసేసి వాహనంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యా దు మే రకు ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బొలెరో వాహనంలో 250కి పైగా ట్రేల్లో టమాటాలున్నాయి. కిలో టమాటా ధర కనీసం రూ.100 లెక్కన 2 టన్నుల టమాటా విలువ రూ.2 లక్షలుంటుంది. 300 మంది శరణార్థులు సముద్రంలో గల్లంతు దాకర్: ఆఫ్రికా దేశమైన సెనెగల్ నుంచి దాదాపు 300 మంది శరణార్థులతో స్పెయిన్‌కు బయలుదేరిన మూడు పడవలు అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యాయి. స్పెయిన్‌కు చెందిన వాకింగ్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం ఈ విషయం వెల్లడించింది. రెండు పడవలు జూన్ 23న సెంట్రల్ సెనెగల్‌లోని కోస్తా తీర ప్రాంత నగరం ఎం»ౌర్ నుంచి బయలుదేరింది. వీటిలో 100 మంది ఉన్నారు. 200 మందితో రెండో పడవ జూన్ 27న కంటైటైన్ పట్టణం నుంచి బయలుదేరింది. తర్వాత మూడు పడవల నుంచి హఠాత్తుగా సంకేతాలు నిలిచిపోయాయి. అవి సముద్రంలో గల్లంతైనట్లు గుర్తించారు. స్పెయిన్ అధికారులు విమానాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
టమాట ధర వింటే నోట మాట రావడం లేదు!
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారుల నోటి నుంచి ట‘మాట’ కా వాలని వినిపించడం లేదు. ప్రస్తుతం కిలో రూ.80 పలకడంతో వామ్మో అంటున్నారు. నెలన్నర క్రితం కిలో టమాట రూ.10–15 రిటైల్‌గా బాక్స్(25కిలోలు) రూ.250–300 విక్రయించగా.. ప్రస్తుతం రిటైల్ రూ.60–80కుబ బాక్స్ టమాటా రూ.1800కు అమ్ముతున్నారు. ఈధర రూ.2వేల నుంచి 2500వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు తెలిపారు. ధర పెరిగితే కిలో టమాట రూ.100 నుంచి రూ. 120 విక్రయించాల్సి ఉంటుందన్నారు. లక్ష్మీపురం మార్కెట్లోని హోల్‌సేల్ వ్యాపారులు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, ముల్కలచెరువు, నెల్లూరు ప్రాంతం నుంచి ఎక్కువగా టమాట దిగుమతి చేసుకుంటారు. అలాగే కర్ణాటకలోని చింతామ ణి, కోలార్ మార్కెట్ల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో పాటు ఉత్తర భారతదేశం నుంచి కూడా హోల్‌సేల్ వ్యాపారులు మదనపల్లి తదితర ప్రాంతాలకు రావడంతో టమాట ధర అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. సగానికి తగ్గిన దిగుమతి... లక్ష్మీపురం మార్కెట్లో టమాట వ్యాపారులు ని త్యం 10 నుంచి 15 డీసీఎంలలో సుమారు 6వేల బాక్సులను దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తు తం ధరలు ఆకాశాన్నంటుండడంతో దిగుమతి ఒకేసారి 2000బాక్సులకు పడిపోయినట్లు టమాట హోల్‌సేల్ వ్యాపారి పాపని భాస్కర్ తెలిపారు. తక్కువ తెప్పించినా చిల్లర వ్యాపారులు కొనుగోలు చేయడం లేదన్నారు. సోమవారం బాక్స్ టమాట రూ.1800కు విక్రయించగా మంగళవారం రూ.2వేలకు విక్రయించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అంటే హోల్‌సేల్ ధర కిలోకు రూ.90 పడుతుందని చిల్లర వ్యాపారులు రూ.120లు కిలో అమ్మాల్సి ఉంటుందన్నారు. కొత్త టమాట వస్తే తప్పా ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
కిలో టమాట రూ.100
మిడ్జిల్ (జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లాలో టమాట రేటు అమాంతం పెరిగింది. మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో కిలో టమాట వంద రూపాయలకు విక్రయించారు. గత వారం 20 రూపాయలకు కిలో ఉన్న టమాట ఒకేసారి వంద రూపాయలకు చేరుకుంది. పచ్చి మిర్చి 80 నుంచి 130 రూపాయలకు చేరడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.