వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో కొనుగోలుదారుల నోటి నుంచి ట‘మాట’ కా వాలని వినిపించడం లేదు. ప్రస్తుతం కిలో రూ.80 పలకడంతో వామ్మో అంటున్నారు. నెలన్నర క్రితం కిలో టమాట రూ.10–15 రిటైల్‌గా బాక్స్(25కిలోలు) రూ.250–300 విక్రయించగా.. ప్రస్తుతం రిటైల్ రూ.60–80కుబ బాక్స్ టమాటా రూ.1800కు అమ్ముతున్నారు. ఈధర రూ.2వేల నుంచి 2500వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు తెలిపారు.
ధర పెరిగితే కిలో టమాట రూ.100 నుంచి రూ. 120 విక్రయించాల్సి ఉంటుందన్నారు. లక్ష్మీపురం మార్కెట్‌లోని హోల్‌సేల్ వ్యాపారులు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, ముల్కలచెరువు, నెల్లూరు ప్రాంతం నుంచి ఎక్కువగా టమాట దిగుమతి చేసుకుంటారు. అలాగే కర్ణాటకలోని చింతామ ణి, కోలార్ మార్కెట్ల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో పాటు ఉత్తర భారతదేశం నుంచి కూడా హోల్‌సేల్ వ్యాపారులు మదనపల్లి తదితర ప్రాంతాలకు రావడంతో టమాట ధర అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.
సగానికి తగ్గిన దిగుమతి...
లక్ష్మీపురం మార్కెట్‌లో టమాట వ్యాపారులు ని త్యం 10 నుంచి 15 డీసీఎంలలో సుమారు 6వేల బాక్సులను దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తు తం ధరలు ఆకాశాన్నంటుండడంతో దిగుమతి ఒకేసారి 2000బాక్సులకు పడిపోయినట్లు టమాట హోల్‌సేల్ వ్యాపారి పాపని భాస్కర్ తెలిపారు. తక్కువ తెప్పించినా చిల్లర వ్యాపారులు కొనుగోలు చేయడం లేదన్నారు.
సోమవారం బాక్స్ టమాట రూ.1800కు విక్రయించగా మంగళవారం రూ.2వేలకు విక్రయించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అంటే హోల్‌సేల్ ధర కిలోకు రూ.90 పడుతుందని చిల్లర వ్యాపారులు రూ.120లు కిలో అమ్మాల్సి ఉంటుందన్నారు. కొత్త టమాట వస్తే తప్పా ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment