సాక్షి, బెంగళూరు: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. బెంగళూరులో టమాటాలతో ఉన్న బొలెరో వ్యాన్‌తో దుండగులు పరారయ్యారు. చిత్రదుర్గకు చెందిన రైతులు బొలెరో వాహనంలో టమాటా లోడుతో బెంగళూరు ఆర్‌ఎంసీకి వచ్చారు. మార్కెట్ యార్డులో వాహనాన్ని నిలిపి టీ తాగడానికి వెళ్లారు. ఇదే అదనుగా ముగ్గురు వ్యక్తులు ఆ వ్యాన్‌ను స్టార్ట్ చేశారు. అడ్డగించగా రైతులే తమ వాహనాన్ని ఢీకొట్టారంటూ బుకాయించారు.
దెబ్బతిన్న తమ వాహనం చూపిస్తామంటూ రైతులను కూడా బొలెరోలోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక రైతులను బయటకు తోసేసి వాహనంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యా దు మే రకు ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బొలెరో వాహనంలో 250కి పైగా ట్రేల్లో టమాటాలున్నాయి. కిలో టమాటా ధర కనీసం రూ.100 లెక్కన 2 టన్నుల టమాటా విలువ రూ.2 లక్షలుంటుంది.
300 మంది శరణార్థులు సముద్రంలో గల్లంతు
దాకర్: ఆఫ్రికా దేశమైన సెనెగల్ నుంచి దాదాపు 300 మంది శరణార్థులతో స్పెయిన్‌కు బయలుదేరిన మూడు పడవలు అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యాయి. స్పెయిన్‌కు చెందిన వాకింగ్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం ఈ విషయం వెల్లడించింది. రెండు పడవలు జూన్ 23న సెంట్రల్ సెనెగల్‌లోని కోస్తా తీర ప్రాంత నగరం ఎం»ౌర్ నుంచి బయలుదేరింది. వీటిలో 100 మంది ఉన్నారు. 200 మందితో రెండో పడవ జూన్ 27న కంటైటైన్ పట్టణం నుంచి బయలుదేరింది. తర్వాత మూడు పడవల నుంచి హఠాత్తుగా సంకేతాలు నిలిచిపోయాయి. అవి సముద్రంలో గల్లంతైనట్లు గుర్తించారు. స్పెయిన్ అధికారులు విమానాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment