కేన్సర్ చికిత్సకు నానో బుడగలు.. | Nano bubbles in the treatment of cancer .. | Sakshi
Sakshi News home page

కేన్సర్ చికిత్సకు నానో బుడగలు..

Published Fri, Apr 4 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

కేన్సర్ చికిత్సకు నానో బుడగలు..

కేన్సర్ చికిత్సకు నానో బుడగలు..

ప్రాణాంతక కేన్సర్‌కు తీవ్రమైన రేడియో ధార్మిక పదార్థాలను వాడే కీమోథెరపీ చికిత్స వల్ల జుట్టు రాలిపోవడం, శరీరం బలహీనపడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటా యి. ఇలా కాకుండా రేడియో ధార్మిక పదార్థాలు కేన్సర్ కణాలపై మాత్రమే పనిచేయగలిగితే? రోగులకు ఎంతో ఉపశమనం కదూ! అందుకే అమెరికా, కెనెడాల్లోని శాస్త్రవేత్తల బృందం కీమోథెరపీ మందుల వినియోగానికి ఓ వినూత్న పద్ధతిని ప్రతిపాదించారు.

 
  కీమోథెరపీ మందుల్ని అతిసూక్ష్మమైన బెలూన్లలో నింపి శరీరంలోకి పంపించడం... అవి కేన్సర్ కణాల వద్దకు చేరుకోగానే.. లేజర్ కిరణాలతో వాటిని పేల్చేసి మందులు ఆ ప్రాంతంలో మాత్రమే విడుదలయ్యేలా చేయడమే ఈ కొత్త పద్ధతి. అలాగే లేజర్ ను ఆపేసిన వెంటనే నానో బెలూన్లు కేన్సర్ కణాల పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు, కణాలను సేకరించి మూసుకుపోతాయి. తర్వాత వాటిని సేకరించి వ్యాధి స్థితిని తెలుసుకుని తదుపరి చికిత్సపైనా నిర్ణయం తీసుకోవచ్చు. మనిషి వెంట్రుకలో వెయ్యో వంతు మాత్రమే ఉండే ఈ నానో బెలూన్లను వంటనూనె లాంటి ఫాస్పోలిపిడ్, పొర్‌ఫెరిన్ అనే సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తారు. ఐదేళ్లలో ఈ పద్ధతిని అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్త జోనథన్ లోవెల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement