తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం!
తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు:
- పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అస్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.
- అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
- ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్ చిన్న ప్రేగు శోషక సామర్థా‍్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
- రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది.
తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు!
►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం.
►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు
►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment