డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని వాటిని అతిగా తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపించడమే గాక లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు న్యూట్రీషియన్లు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అతిసారం లేదా అపానవాయువుని పెంచడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం.
అలెర్జీ: డ్రై ఫ్రూట్స్ కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దీందో శరీరంపై దురద, ఊపిరాడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలర్జీలు ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినకపోవడమే మంచిదని ఆహార నిపుణలు చెబుతున్నారు.
బరువు పెరుగుట: కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకుంటే తొందరగా బరువు పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ మోస్తారుగా బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
కిడ్నీ స్టోన్: జీడిపప్పుడ, బాదంపప్పు, వేరశేనగలో ఆక్సలేట్‌లు ఉంటాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరగుతుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు: జీర్ణశక్తి సరిగా లేనివారు ఇవి తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జీడిపప్పులో ఉండే ఫ్యాట్, ఫైబరే దీనికి కారణం.
(చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment