న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ఈ మేరకు నేషనల్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్‌ఐ) కమిటీ మే 27వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక అందజేసింది. మొత్తం 60 కేసులకు గాను 55 కేసులకు టీకాతో స్థిరమైన సంబంధమున్నట్లు స్పష్టం చేసింది.
ఇందులోని 36 కేసుల్లో ఆందోళన సంబంధ సమస్యలు, 18 ఉత్పత్తి సంబంధమైనవి, ఒక్కటి మాత్రం ఈ రెండింటికీ చెందినదిగా వర్గీకరించింది. మిగతా, ఒక మరణం సహా 5 కేసులకు టీకాతో సంబంధం ఉన్నట్లు నిరూపణ కాలేదని పేర్కొంది. టీకా అనంతరం సంభవించిన ఈ మరణాన్ని యాదృచ్ఛిక ఘటనగా పేర్కొంది. దేశంలో జనవరి నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి టీకా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment