ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి? | Have you had similar nightmares meaning and consequences | Sakshi
Sakshi News home page

ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?

Published Sat, Jan 11 2025 11:03 AM | Last Updated on Sat, Jan 11 2025 11:16 AM

Have you had similar nightmares meaning and consequences

పీడకలలు (Nightmares) ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఏదో ఒక సమయంలో రావడం మామూలే. తీవ్రమైన మానసిక ఒత్తిడికీ, ఆవేదనకు గురైన / గురవుతున్న వారితో పాటు ఆర్థిక, సామాజిక కారణాలతో బాధపడుతూ ఉండేవారికి ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక మరికొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత జెట్‌లాగ్‌ టైమ్‌లో లేదా ఆ తర్వాత కూడా పీడకలలు  రావచ్చు. ఇవి అదేపనిగా వస్తుంటే అందుకు కారణాలేమిటి, వాటికి చికిత్స ఏమిటన్న విషయాలను తెలుసుకుందాం.

అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో పీడకలలు రావడం అన్నది సాధారణమే అయినా... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం వల్లా... అలాగే వాటి దుష్ప్రభావం వారి దైనందిన జీవితంపై పడటంతో సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బతినడం జరగవచ్చు. దాంతో తమకు సంబంధించిన ఇతరత్రా  పనులేవీ చేసుకోలేని విధంగా తీవ్రమైన మానసిక ఆందోళనకూ, తీవ్రమైన ఒత్తిడికీ, ఆందోళనకూ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’(Nightmare disorder)గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’(Dream anxiety disorder)  అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ లేదా ‘రిపీటెడ్‌ నైటమేర్స్‌’ (Repeated nightmares) అంటున్నారు. 

(కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!)

సాధారణంగా ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ సమస్యకు మందుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ధైర్య వచనాలు చెప్పి సాంత్వన కలిగించడం అవసరం. అలాగే వాళ్లకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో పదే పదే ఇలాంటి కలలు రావడానికి మరో అంతర్గత కారణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి అండర్‌లైయింగ్‌ మెడికల్‌ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు.  

మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్‌ రెడ్యూసింగ్‌ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. అయితే భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, కుటుంబ పెద్ద మరణం... ఇలాంటి ఏవైనా కారణాలతో  కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే...  పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు లోనైనవారిలో  ‘ఇమేజరీ రిహార్సల్‌ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాంతమైనట్లుగా బాధితుల మనసులో నాటుకుపోయేలా చేస్తారు. ఫలితంగా పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 
 

ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్‌ ఫుడ్‌ ఈ లడ్డూ...అంతేనా!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement