సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో సర్కారీ బడుల విద్యార్థుల కోసం.. సీఎం అల్పాహార(బ్రేక్‌ఫాస్ట్) పథకం ప్రారంభమైంది. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు శుక్రవారం ఉదయం ఈ పథకం ప్రారంభించారు. మరోవైపు అదే సమయంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 సర్కార్ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ అందించనుంది. తరగతుల ప్రారంభం కంటే అరగంట ముందు విద్యార్థులకు ఈ టిఫిన్ అందిస్తారు.
సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఇప్పటికే ఖరారయ్యింది. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అల్ఫాహార నాణ్యతను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పాఠశాలల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తారని ప్రభుత్వం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment