క్యారట్‌ డిలైట్‌.. హెల్తీ అండ్‌ టేస్టీగా ఇలా చేసుకోండి | Best Carrot Sweet Recipes: How To Make Carrot Delight Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Carrot Delight Recipe: క్యారట్‌ డిలైట్‌.. హెల్తీ అండ్‌ టేస్టీగా ఇలా చేసుకోండి

Published Wed, Sep 27 2023 12:01 PM | Last Updated on Wed, Sep 27 2023 12:57 PM

How To Make Carrot Delight Recipe In Telugu - Sakshi

క్యారట్‌ డిలైట్‌ తయారీకి కావల్సినవి:

క్యారట్స్‌ – అరకేజీ; పంచదార – అరకప్పు; కార్న్‌ఫ్లోర్‌ – పావు కప్పు;
నీళ్లు – కప్పు; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు;
ఎండుకొబ్బరి తురుము – గార్నిష్‌కు సరిపడా.



తయారీ విధానమిలా:
క్యారట్‌ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి ∙ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్‌ రానిచ్చి, చల్లారనివ్వాలి.ముక్కలు చల్లారాక పేస్టులా గ్రైండ్‌ చేయాలి ∙మెత్తని పేస్టుని వడగట్టాలి ∙వడగట్టిన పేస్టులో పంచదార, కార్న్‌ఫ్లోర్, నీళ్లు వేసి కలపాలి.

మిశ్రమాన్ని చక్కగా కలిపిన తరువాత మందపాటి బాణలిలో వేయాలి ∙మీడియం మంట మీద తిప్పుతూ ఉడికించాలి.మిశ్రమం చిక్కబడినప్పుడు నెయ్యి వేసి తిప్పాలి ∙అడుగంటుతున్నప్పుడు తీసి నెయ్యి రాసిన ప్లేటులో సమానంగా పోయాలి ∙గంట తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి, కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement