
స్టఫ్డ్ బ్రెడ్ పకోడి తయారికి కావల్సినవి:
వైట్ బ్రెడ్‌స్లైసులు – నాలుగు; పన్నీర్ – రెండు స్లైసులు; పుదీనా, కొత్తిమీర చట్నీ – నాలుగు టీస్పూన్లు;
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.స్టఫింగ్ : ఉడికించి చిదుముకున్న బంగాళ దుంప – కప్పు ;
ఉల్లిపాయ – ఒకటి ; పచ్చిమిర్చి – రెండు; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను;
జీలకర్ర పొడి – టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా;
కారం – అరటీస్పూను ; ఆమ్ చూర్ పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా –అరటీస్పూను;
కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు.
బ్యాటర్: శనగపిండి – ఒకటిన్నర కప్పులు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; వాము – అరటీస్పూను ;
ఉప్పు – రుచికి సరిపడా; కారం – అరటీస్పూను ; వంటసోడా – పావు టీస్పూను.
తయారీ విధానమిలా:
ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
పెద్ద గిన్నెతీసుకుని స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
మరో గిన్నెలో బ్యాటర్ కోసం తీసుకున్న పదార్థాలు, తగినన్ని నీళ్లుపోసి పకోడి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్ అంచులను తీసేసి పుదీనా కొత్తిమీర చట్నీని రాయాలి ∙దీనిపైన బంగాళదుంపల స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టాలి.
చివరిగా పన్నీర్ స్లైస్‌ను పెట్టి మరో బ్రెడ్‌స్లైస్‌తో కప్పేసి రెండు ముక్కలుగా కట్ చేయాలి.
ఇప్పుడు బ్యాటర్‌లో బేకింగ్ సోడా వేసి కలపాలి.
శాండ్‌విచ్‌లా స్టఫ్ చేసిన బ్రెడ్ స్లైసులను బ్యాటర్‌లో ముంచి... సలసల మరుగుతోన్న నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారాక తీసేసి చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.