
సేమియా పనియారం తయారీకి కావల్సినవి:
సేమియా – 1 కప్పు, రవ్వ – అర కప్పు
పెరుగు – 1 కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తురుము – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కరివేపాకు – కొద్దిగా (చిన్నగా తురుమాలి), క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – అర టీ æస్పూన్, నూనె – సరిపడా
నీళ్లు – చాలినన్ని, నెయ్యి – 1 టీస్పూన్
తయారీ విధానమిలా:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో సేమియా, రవ్వను దోరగా వేయించుకోవాలి. పెరుగు, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించాలి. అనంతరం కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని తిప్పుతూ ఉండాలి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత పొంగనాల పెనం తీసుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె పోసుకుని.. గుంత గరిటె సాయంతో సేమియా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇరువైపులా దోరగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ రెసిపి చక్కగా సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment