పోషకాలు విరివిగా లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్‌ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్ మొక్కలాగా కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం.
సోయాకూరలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
సోయా, ఓట్స్ పరాటా
కావాల్సినవి :
దిల్ ఆకులు : ఒక కప్పు
ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్
గోధుమపిండి : ఒక కప్పు
నెయ్యి రెండు టీస్పూన్లు
నాలుగు పచ్చిమిర్చి
జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు,
ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు
తయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి. తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్ వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్‌చేసి పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం మీద నెయ్యివేసి, సన్నని మంటమీద కాల్చుకుంటే, టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్ పరాటా రెడీ. దీన్ని ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment