
అటుకుల చెగోడీలీకు కావల్సిన పదార్థాలు:
అటుకులు – అర కప్పు,పుట్నాల పప్పు – పావు కప్పు
బియ్యప్పిండి – 1 కప్పు,నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 1 కప్పు+ఇంకొన్ని,కారం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత,వాము – అర టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్లు,ఇంగువా – పావు టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా అటుకులు, పుట్నాల పప్పును మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అందులో బియ్యప్పిండి కూడా జల్లెడ పట్టి, ఆ రెండిటినీ బాగా కలపాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, చిన్న మంట మీద ఆ మొత్తం పిండిని దోరగా వేయించి, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కూడా మరోసారి గరిటెతో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, నువ్వులు, వాము, ఇంగువా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
ఈలోపు బియ్యప్పిండి తీసుకున్న కప్పుతోనే నీళ్లనూ తీసుకుని, వేడి చేసి.. ఈ మిశ్రమంలో పోసుకుని గరిటెతో అటూ ఇటూగా కలపాలి. తర్వాత చల్లారే వరకు ఓ పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆపైన కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. చిన్నచిన్న ఉండల్లా తీసుకుని.. చెగోడీలు చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment