క్రిస్మస్‌ స్పెషల్‌: సుగర్‌ కుకీస్‌, పిల్లలు ఇష్టంగా తింటారు | How To Make Sugar Cookies Recipe In Telugu | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ స్పెషల్‌: సుగర్‌ కుకీస్‌, పిల్లలు ఇష్టంగా తింటారు

Published Mon, Dec 18 2023 4:32 PM | Last Updated on Mon, Dec 18 2023 4:35 PM

How To Make Sugar Cookies Recipe In Telugu - Sakshi

సుగర్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి: 

బటర్‌ – పావు కప్పు; క్రీమ్‌ చీజ్‌ – పావుకప్పు;
పంచదార – ఒకటిన్నర కప్పులు; గుడ్లు – రెండు;
వెనీలా ఎసెన్స్‌ – ఒకటిన్నర టీస్పూన్లు; బాదం ఎసెన్స్‌ – పావు టీస్పూను;
మైదా – రెండున్నర కప్పులు; కార్న్‌స్టార్చ్‌ – టేబుల్‌ స్పూను;
వంటసోడా – టీస్పూను; ఉప్పు – పావు టీస్పూను;
ఎరుపు, పచ్చరంగు కలిపిన పంచదార –గార్నిష్‌కు సరిపడా.

తయారీ విధానమిలా:
ఒక పెద్దగిన్నెలో బటర్, క్రీమ్‌ చీజ్, పంచదార, గుడ్లు, వెనీలా, బాదం ఎసెన్స్‌ వేసి హ్యాండ్‌ మిక్సర్‌తో ఐదు నిమిషాల పాటు కలపాలి ∙తరువాత మైదా, కార్న్‌ స్టార్చ్, వంటసోడా, ఉప్పు వేసి పిండి ముద్దలా కలపాలి ∙ఈ పిండి ముద్దను రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. రెండు గంటల తరువాత తీసి చిన్నచిన్న ఉండలుగా చేసి బేకింగ్‌ ట్రేలో పెట్టాలి.ఫోర్క్‌ సాయంతో ఉండపైన ఇంటూ ఆకారంలో ముద్ర పడేటట్లు వత్తాలి ∙ఇలా అన్నిటినీ వత్తుకున్నాక ఎరుపు, పచ్చరంగు పంచదారను ఈ కుకీస్‌పైన చల్లాలి ∙ఇప్పుడు బేకింగ్‌ ట్రేని అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్‌ హీట్స్‌వద్ద పదిహేను నిమిషాలు బేక్‌ చేస్తే సుగర్‌ కుకీస్‌ రెడీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement