![How To Make Coconut Poli Or Kobbari Bobbatlu - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/24/bobbatlu.jpg.webp?itok=sdEEDFcO)
కావలసినవి:
మైదా – మూడు కప్పులు
పసుపు – పావు టీస్పూను
నువ్వుల నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
బెల్లం తరుగు – రెండు కప్పులు
పచ్చికొబ్బరి తురుము – నాలుగు కప్పులు
యాలకులపొడి – అరటీస్పూను
నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: పెద్దగిన్నెలో మైదా, పసుపు వేసి కలపాలి. దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ ముద్దలా కలపాలి. చివరగా నువ్వుల నూనె వేసి కలిపి మూతపెట్టి నలభై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో బెల్లం, అరకప్పు నీళ్లుపోసి సన్నని మంట మీద కరగనివ్వాలి. ఐదు నిమిషాలకు బెల్లం కరుగుతుంది. బెల్లం నీటిని పలుచని వస్త్రం లేదా సన్నని చిల్లులున్న స్ట్రెయినర్‌తో వడగట్టాలి. ∙వడగట్టిన బెల్లం నీటిని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి అడుగంటకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి.
మిశ్రమం దగ్గరపడి ఉండలా మారుతున్నప్పుడు యాలకుల పొడి వేసి మరోమారు కలిపి దించేయాలి. అరటి ఆకు లేదా బ్లాటింగ్ పేపర్‌కు కొద్దిగా నెయ్యి రాయాలి. కలిపి సిద్ధంగా ఉంచిన మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు ఒక్కో ఉండను పూరీలా వత్తాలి. కొబ్బరి మిశ్రమాన్ని పూరీ మధ్యలో పెట్టి, మిశ్రమం బయటకు రాకుండా చుట్టాలి. కొబ్బరి మిశ్రమం బయటకు కనబడకుండా మైదా పిండితో కప్పేయాలి. చేతికి నెయ్యి రాసుకుని వీటిని బొబ్బట్లలా వత్తుకోవాలి. ఇలా పిండినంతటనీ బొబ్బట్లలా వత్తుకున్న తర్వాత పెనం వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి మీడియం మంటమీద రెండు వైపులా కాల్చుకుంటే కొబ్బరి పోలీ రెడీ.
(చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment