
అటుకుల శక్కర్ పారే తయారీకి కావల్సినవి:
అటుకులు – అర కప్పు
(మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి)
మైదా – 2 కప్పులు
పంచదార – అర కప్పు
నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు
నీళ్లు – కావాల్సినన్ని
నువ్వులు – కొద్దిగా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు పోసుకుని పంచదార కరిగేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి, అటుకుల పొడి, నువ్వులు వేసుకుని ముద్దలా చేసుకుని సుమారు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.