
పనీర్ కుర్‌కురే తయారీకి కావల్సినవి:
నిలువుగా కోసిన పనీర్ ముక్కలు – రెండు కప్పులు; పసుపు – టీస్పూను;
కారం – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కసూరీ మేథీ – టేబుల్ స్పూన్;
వాము – అరటీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా – టీస్పూను;
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను;
కార్న్‌ఫ్లేక్స్ – రెండు కప్పులు; శనగపిండి – రెండు కప్పులు; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.
తయారీ విధానమిలా:
►పనీర్ ముక్కలపైన చిటికెడు సాల్ట్, కారం, టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
► పెద్ద గిన్నె తీసుకుని శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరీ మేథీ, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి
► ఇప్పుడు నీళ్లు పోసి బజ్జీపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్‌ను నలిపి పెట్టుకోవాలి
► ఇప్పుడు ఒక్కో పనీర్ ముక్కను తీసుకుని ముందుగా శనగపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత కార్న్‌ఫ్లేక్స్‌ను అద్ది సలసలా కాగుతోన్న నూనెలో వేసి డీప్‌ఫ్రై చేయాలి ∙పనీర్ ముక్క క్రిస్పీగా మారితే పన్నీర్ కుర్‌కురే రెడీ.
Comments
Please login to add a commentAdd a comment