ప్రతీకాత్మక చిత్రం
Beauty Tips In Telugu: మేని నిగారింపుకు, చర్మ లావణ్యాన్ని ఇనుమడింపచేసుకోవడానికి దోహదం చేసే కొన్ని సహజసిద్థమైన క్లెన్సర్‌లు, ప్యాక్‌లను ఇంట్లో మనం రోజూ వాడే వాటితోనే చేసుకోవచ్చు.
►గుడ్డులోని తెల్లసొనలో తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల ఎండకు నల్లబడిన ముఖచర్మం తిరిగి మామూలవుతుంది.
►బార్లీ పొడిలో తేనె, పెరుగు, బాదం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.
►టొమాటో రసానికి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
►శనగపిండిలో క్యారట్ రసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి.
►రెండు టీ స్పూన్ల టొమాటో రసానికి నాలుగు టీ స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి.
►రెండు టీ స్పూన్ల క్యాబేజ్ రసంలో చిటికెడు ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మేని మెరిసిపోతుంది.
మెడ నల్లగా ఉందా?
ముఖం, మెడ మీద చర్మం నల్లగా, జిడ్డుగా అనిపిస్తే ఇంట్లోనే ఇలా క్లెన్సర్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడతాయి. మృతకణాలను తొలగించడంలోనూ ఉపకరిస్తాయి. కాబట్టి ఈ రెండింటితో తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
టొమాటోను గుజ్జు చేయాలి. దీనిని పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి ఒత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్‌కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి.. పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
నోట్: పొడి, సున్నితమైన చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది.
చదవండి: Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు!
శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్ లక్షణాలు.. నివారణ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment