
రోడ్డును నీటితో శుభ్రం చేస్తున్న ఫైర్ సిబ్బంది
మలక్‌పేట: కొత్తపేట నుంచి మలక్‌పేట వైపు కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ఆటో వెనుక డోర్ లాక్ ఊడి దిల్‌సుఖ్‌నగర్ గడ్డిఅన్నారం చౌరస్తాలో రోడ్డుపై పడిపోయాయి. ఒక్కసారిగా దారి అంతా పగిలిన గుడ్లతో నిండిపోయింది. వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించలేక ఇబ్బంది పడ్డారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై పడిన గుడ్లను జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది ఎత్తించారు. మలక్‌పేట ఫైర్ సిబ్బంది రోడ్డుపై నీరు కొట్టి శుభ్రం చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుడ్లు పడిన మేరకు రోడ్డుపై పొట్టు చల్లారు. రూ.20 వేలు విలువ చేసే గుడ్లు పలిగి పోయినట్లు డ్రైవర్ వినోద్, హెల్పర్ వీరస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment